Virat Kohli Emotional Post Over Indai Lost: టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమిని టీమిండియా ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఈ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లీ.. జట్టుకు కప్‌ను అందించలేకపోయాడు. భారత్ ఓటమి తరువాత సోషల్ మీడియాలో కోహ్లీ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. సెమీ ఫైనల్లో టీమిండియా ఓటమి విరాట్ ఎంత నిరాశకు గురయ్యాడో.. ఎంత ఉద్వేగానికి లోనయ్యోడో పోస్ట్‌ను చూస్తే అర్థమవుతోంది. అడిలైడ్ ఓవల్ మైదానంలో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.
విరాట్ కోహ్లీ జట్టుతో కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఆటగాళ్లందరూ జాతీయ గీతం కోసం నిలబడి ఉన్నారు. 'మేము మా కలను సాధించకుండా హృదయ విదారకంతో ఆస్ట్రేలియాను విడిచిపెడుతున్నాం. కానీ జట్టుగా అనేక మధురాణుభూతులు తిరిగి తీసుకుంటున్నాం. ఇక్కడి నుంచి మరింత మెరుగవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం..' అంటూ కోహ్లీ రాసుకొచ్చాడు. స్టేడియంలో తమను ఆదరించడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపాడు. టీమిండియా జెర్సీని ధరించి దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ గర్వంగా అనిపిస్తుందన్నాడు. ఈ ప్రపంచ కప్‌లో కోహ్లీ 6 ఇన్నింగ్స్‌ల్లో 4 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 296 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
We leave Australian shores short of achieving our dream and with disappointment in our hearts but we can take back a lot of memorable moments as a group and aim to get better from here on. pic.twitter.com/l5NHYMZXPA
— Virat Kohli (@imVkohli) November 11, 2022
ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా ఇలాంటి ఫొటోనే షేర్ చేసుకుంటూ.. హార్ట్ బ్రేక్ సింబల్ యాడ్ చేశాడు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ రాణించినా.. భారత్‌కు ఓటమి తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. హార్దిక్ 33 బంతుల్లో 63 పరుగులు చేయగా, విరాట్ 40 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఆ తరువాత 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఇంగ్లాండ్ లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ జోస్ బట్లర్ 80, అలెక్స్ హేల్స్ 86 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
— K L Rahul (@klrahul) November 11, 2022
Also Read: సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్లు ఇవ్వొచ్చు.. టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే: గవాస్కర్
Also Read: Aadhar Update: ఆధార్‌లో కొత్త మార్పులు.. తప్పక తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook