Virat Kohli: ఎప్పటికీ కోహ్లీ గర్జించే సింహమే..చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తికర ట్వీట్..!

Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌ అందుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సుదీర్ఘ కాలం తర్వాత అతడి బ్యాట్ నుంచి సెంచరీ జాలు వారింది. దీనిపై తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ స్పందించింది.

Written by - Alla Swamy | Last Updated : Sep 10, 2022, 02:38 PM IST
  • టచ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ
  • సుదీర్ఘ కాలం తర్వాత సెంచరీ
  • సర్వత్రా ప్రశంసలు
Virat Kohli: ఎప్పటికీ కోహ్లీ గర్జించే సింహమే..చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తికర ట్వీట్..!

Virat Kohli: ఆసియాకప్‌లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టచ్‌లోకి వచ్చాడు. దాదాపు వెయ్యి రోజుల తర్వాత సెంచరీతో అలరించాడు. దీంతో టీ20ల్లో తన పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. ఆసియాకప్ సూపర్-4లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో 71వ సెంచరీ సాధించాడు. 200 స్ట్రైక్‌ రేట్‌తో 122 పరుగులు చేశాడు. ఈఇన్నింగ్స్‌లో మునుపటి కోహ్లీని కనిపించాడు. అతడి ఆటపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ వేదికగా పలువురు తాజా, మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు.

తాజాగా ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేరింది. కాస్త వినూత్నంగా కోహ్లీకి విషెస్‌ చెప్పింది. ఇప్పుడా ట్వీట్ వైరల్‌గా మారింది. కింగ్ ఈజ్‌ బ్యాక్ అని వారంటున్నారు..కానీ..కోహ్లీ ఆటను ఎప్పుడైనా విడిచి పెట్టాడా లేదు కదా అంటూ ట్వీట్ చేసింది. పోరాటాల్లో అతడు ఎప్పుడూ ముందే ఉన్నాడని..యుద్ధాలను, విమర్శలను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నాడని తెలిపింది. ఒక్కసారి కూడా వెను తిరిగి చూడలేదు..ఓ యోధుడిని ఎలాంటి అడ్డంకులు నిలువరించలేవని ట్వీట్‌లో సూపర్ కింగ్స్ పేర్కొంది.

క్రికెట్ ఇంకా మిగిలే ఉంది అంటూ తన ట్విట్టర్ ద్వారా కోహ్లీ ఆట తీరును చెన్నై జట్టు కొనియాడింది. దీనికి గర్జించే సింహం అంటూ కోహ్లీ ఫోటోను షేర్‌ చేసింది. మొన్న అఫ్ఘనిస్థాన్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అలరించాడు. 61 బంతులను ఎదుర్కొని 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో ఆరు సిక్సర్లు, 12 ఫోర్లు ఉన్నాయి. ఈఇన్నింగ్స్‌తో టీ20ల్లో తొలి అంతర్జాతీయ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.

Also read:సీతారామం సినిమాలో తొమ్మిది మంది డైరెక్టర్లు... వారిని అబ్జర్వ్ చేశారా?

Also read:KCR National Politics: గూట్లో రాయి తీయలేనోడు.. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఈటల సెటైర్స్...   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News