Vinesh Phogat: వినేష్ ఫోగాట్ కేసు..ఆగస్టు 13కు తీర్పు వాయిదా..!

Vinesh Phogat Disqualification: భారత స్టార్ రెజ్లర్ వినేషన్ ఫోగాట్ కేసు వాయిదా పడింది. తీర్పును ఆగస్టు 13 వరకు వాయిదా వేస్తున్నట్లు ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ వెల్లడించింది. రెజ్లింగ్ ఫైనల్ కు ముందు 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో ఐఓసీ ఫొగాట్ ను డిస్ క్యాలిఫై చేసిన సంగతి తెలిసిందే. అయితే నకు సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలంటూ వినేష్ కోర్టుకు వెళ్లారు. 

Written by - Bhoomi | Last Updated : Aug 10, 2024, 11:28 PM IST
Vinesh Phogat: వినేష్ ఫోగాట్ కేసు..ఆగస్టు 13కు తీర్పు వాయిదా..!

Vinesh Phogat Disqualification: పారిస్ ఒలంపిక్స్ లో అనర్హత వేటుతో పసిడి పథకం చేజార్చుకున్న వినేష్ ఫొగట్ న్యాయం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. తాజాగా శనివారం వినేష్ అనర్హత వేటుపై  విచారణ కొనసాగిస్తున్న స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్స్ కోర్టు తీర్పును ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ఒలంపిక్స్ పోటీలు ముగిసే లోపు ఈ తీర్పు వస్తుందని ఆశించిన క్రీడా అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. నేడు తీర్పు వెలువడి ఉంటే వినేష్ పోగట్టుకు రజత పథకం దక్కి ఉండేదని భారత ఒలంపిక్ సంఘం ఆశలు పెట్టుకుంది.

Also Read: Give Plastic Take Gold: ప్లాస్టిక్  ఇస్తే..బంగారు నాణేలు ఇస్తారు..ఎక్కడో తెలుసా?

మహిళా రెజ్లింగ్ 50 కేజీల విభాగం ఫైనల్ పోటీకి ముందు బరువు ఎక్కువగా ఉందని తేలడంతో, వినేష్ ను అనర్హురాలిగా ప్రకటిస్తూ ఒలంపిక్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై బుధవారం ఆర్బిట్రేషన్ కు అప్పీల్ చేశారు. భారత రెజ్లర్ వినతిని ఆర్బిట్రేషన్ స్వీకరించింది. ప్రముఖ న్యాయవాది భారత ప్రభుత్వం మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే వినేశ్ తరపున వాదనలను వినిపించారు. కానీ ఆర్బిట్రేషన్ కోర్టు మాత్రం తీర్పును ఆగస్టు 13వ తేదీకి వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే వినేష్ 50 కేజీల రెజ్లింగ్ మహిళా విభాగం ఫైనల్ పోటీకి ముందు క్రీడాకారుల ఎత్తు. బరువు పరీక్షించగా వినేష్ బరువు 50 కేజీల కన్నా 100 గ్రాములు ఎక్కువగా ఉంది. దీంతో ఆమెను పోటీకి అనర్హురాలిగా ప్రకటించారు. అయితే ఈ విషయంలో వినేష్ కు అన్యాయం జరిగిందని భారత ఒలంపిక్ సంఘం సిఏసి అనే స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ అంతర్జాతీయ సంస్థ పిటీషన్ వేసింది. దీనిపై తీర్పు వెలువడేందుకు సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది క్రీడలకు సంబంధించిన పలు వివాదాలను ఈ అంతర్జాతీయ సంస్థ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరిస్తుంది.

​Also Read:  Bank Loan : ఆ బ్యాంకు కస్టమర్లకు బిగ్ షాక్..భారీగా పెరిగిన వడ్డీ రేట్లు..!!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News