Virat Kohli's heartfelt message for AB de Villiers: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ (ఏబీడీ) అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు శుక్రవారం సంచలన ప్రకటన చేశాడు. దీనిపై ఆర్సీబీలో ఏబీడీ సహచర ఆటగాడు, మిత్రుడు.. విరాట్ కోహ్లీ భావోద్వేగంగా స్పందించాడు.
ఏబీడీ తీసుకున్న నిర్ణయం తన గుండెను ముక్కలు చేసింది అంటూ కోహ్లీ స్పందించాడు. అయితే సరైన సమసయంలోనే ఆటకు గుడ్ బై చెప్పాలనే ఆలోచనను స్వాగతిస్తున్నట్లు చెప్పాడు.
ఏబీ అత్యుత్తమ ఆటగాడు అని తాను కలిసిన వ్యక్తుల్లో అత్యంత స్పూర్తిదాయకమైన వ్యక్తి కూడా అతడేని కోహ్లీ తెలిపాడు కోహ్లీ.
Also read: మిస్టర్ 360 షాకింగ్ నిర్ణయం: అన్ని ఫార్మెట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీ డివిలియర్స్
'ఆర్సీబీ కోసం నువ్వు సర్వస్వం దారపోశావు. నువ్వేమిటో.. ఈ ఫ్రాంచైజీకి నువ్వు చేసిన కృషి నా గుండెల్లో చిరస్థాయిగా ఉంటుంది. చిన్న స్వామి స్టేడియం నీ ఆటను మిస్సవుతుంది. నీతో కలిసి ఆడే అవకాశాన్ని నేను కోల్పోతా.. ఐ లవ్ యూ బ్రదర్.. నేను నీకెప్పుడూ నంబర్ 1 ఫ్యాన్నే' అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు కోహ్లీ.
క్రికెట్ కన్నా తమ ఇద్దరి మధ్య బంధం ఎంతో గొప్పదని.. అది ఎప్పటికి అలానే ఉంటుందని కోహ్లీ భావోద్వేగ భరితంగా రాసుకొచ్చాడు.
ఏబీడీ గురించి ట్విట్టర్లో కోహ్లీ చేసిన ట్వీట్‌కు.. ఏబీడీ కూడా లవ్ యూ టూ మై బ్రదర్ అంటూ రిప్లై ఇచ్చాడు ఏబీ డివిలియర్స్.
This hurts my heart but I know you've made the best decision for yourself and your family like you've always done. 💔I love you 💔 @ABdeVilliers17
— Virat Kohli (@imVkohli) November 19, 2021
Also read: సంచలనం: మహిళతో సెక్స్ చాటింగ్.. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేసిన పైన్!
వీరితో పాటు.. పలువురు ఇండియాన్ ఆటగాళ్లు, మాజీ ప్రేయర్స్ కూడా ఏబీడీకి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలిపారు.
క్రికెట్లో మీరు ఓ లెజండ్ అంటూ శిఖర్ ధావన్ స్పందించాడు. ఆధునిక క్రికెట్లో మీరు ఒకరని ఎన్సీఏ డైరెక్టర్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు.
ఆర్సీబీ భావోద్వేగం..
ఏబీడీ రిటైర్మెంట్ పట్ల ఆర్సీబీ ఫ్రాంఛైజీ కూడా భావోద్వేగంగా స్పందించింది. 'నీ రిటైర్మెంట్తో ఒక శకం ముగిసింది. ఆర్సీబీలో నిన్ను బాగా మిస్సవుతాం. ఆర్సీబీకి నువ్వు ఇచ్చినదానికి ధన్యవాదాలు. హ్యాపీ రైటర్మెంట్ లెజెండ్' అంటూ ట్వీట్ చేసింది.
Also read: సిరీస్ గెలిచే లక్ష్యంతో ఇండియా.. ఆశలు సజీవం చేసుకునేందుకు కివీస్!
Also read: మహ్మద్ సిరాజ్ పై చేయి చేసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook