Shoaib Akhtar: డ్రగ్స్ వాడమని ఒత్తిడి తెచ్చేవారు..వాళ్లెవరంటే

పాకిస్తాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అఖ్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు బౌలింగ్ వేగాన్ని పెంచుకోడానికి డ్రగ్స్ వాడమని ఒత్తిడి తెచ్చేవారంటూ వ్యాఖ్యలు చేశాడు.

Last Updated : Nov 25, 2020, 02:04 PM IST
Shoaib Akhtar: డ్రగ్స్ వాడమని ఒత్తిడి తెచ్చేవారు..వాళ్లెవరంటే

పాకిస్తాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అఖ్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు బౌలింగ్ వేగాన్ని పెంచుకోడానికి డ్రగ్స్ వాడమని ఒత్తిడి తెచ్చేవారంటూ వ్యాఖ్యలు చేశాడు.

క్రికెట్ ( Cricket ) కెరీర్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాక..పాకిస్తాన్ పేస్ బౌలర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్ గా ప్రాచుర్యం పొందిన షోయబ్ అఖ్తర్ ( Shoaib Akhtar ) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ లో మాదక ద్రవ్యాల నిరోధక శాఖ నిర్వహించిన ఓ కార్యక్రమంలో షోయబ్ ముఖ్య అతిధిగా హాజరై..ఈ వ్యాఖ్యలు చేశాడు. బౌలింగ్ లో వేగం పెంచుకునేందుకు డ్రగ్స్ ( Drugs )వాడమని తరచూ ఒత్తిడి తెచ్చేవారని..అయితే తాను తిరస్కరించానని చెప్పారు. అయితే డ్రగ్స్ వాడమని సూచించిన వ్యక్తుల పేర్లను మాత్రం షోయబ్ వెల్లడించలేదు. ఎంతో ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లు తప్పుదోవ పట్టి..భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని చెప్పాడు. 

తన కెరీర్ ప్రారంభంలో బౌలింగ్ ( Bowling ) వేగం పెంచుకునేందుకు, కనీసం గంటకు వంద కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేసందుకు డ్రగ్స్ తీసుకోవాలని చెప్పేవారని..అయితే తాను తిరస్కరించానని రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అఖ్తర్ చెప్పాడు. పాకిస్థాన్‌ను డ్రగ్స్ రహిత దేశం ( pakistan as drugs free country ) గా మార్చడానికి ఈ శాఖ గొప్పగా పనిచేస్తుందని చెప్పారు. మంచి భవిష్యత్తు కోసం ఆటలు ఆడాలని.. శారీరక వ్యాయామాలు చేయాలని సూచించాడు. 151 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు సంధించిన అఖ్తర్..వన్డే క్రికెట్ లో ఫాస్టెస్ట్ బౌలర్ గా రికార్డు సాధించాడు. పాకిస్తాన్ తరపున 46 టెస్టులు, 163 3 వన్డేలు, 15 టీ20లు ఆడిన అఖ్తర్.. 2010లో చివరి మ్యాచ్ ఆడాడు. మొత్తం 444 వికెట్లు తీశాడు. Also read: Dele Alli catch viral video: ఫుట్‌బాల్ ప్లేయర్ క్రికెట్ బాల్ క్యాచ్ పడితే ఇలా ఉంటుందా ?

Trending News