France beat Morocco in 2022 FIFA World Cup 2nd Semi Final: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2022 రెండో సెమీస్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ అదరగొట్టింది. మొరాకోను 2-0 తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ పూర్తిస్థాయి ఆధిపత్యం సాధించి.. ఆఫ్రికా జట్టు అయిన మొరాకో ఫైనల్ ఆశలను చిదిమేసింది. ఈ విజయంతో మరోసారి కప్పు సాధించే అవకాశం ఫ్రాన్స్ ముందుంది. ఇప్పటికే సెమీస్ చేరిన మాజీ ఛాంపియన్ అర్జెంటీనాతో ఆదివారం (డిసెంబర్ 18) జరిగే తుది పోరులో ఫ్రాన్స్ అమితుమీ తేల్చుకోనుంది.
రెండో సెమీస్ మ్యాచ్ ఆరంభంలో 5వ నిమిషంలోనే ఫ్రాన్స్ ప్లేయర్ థియో హెర్నాండెజ్ అద్భుత రీతిలో గోల్ చేశాడు. ఈ గోల్‌తో ఫ్రాన్స్ 1-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆపై తొలి అర్ధభాగం ముగిసేవరకు ఇరు జట్ల ఆటగాళ్లు గోల్స్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ.. మరో గోల్ నమోదు కాలేదు. తొలి అర్ధభాగంలో ఫ్రాన్స్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.రెండో భాగంలో 79 నిమిషాల వద్ద ఫ్రాన్స్ ఆటగాడు రాండల్ కోలో మువానీ గోల్ చేసి.. 2-0 తేడాతో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. తొలి గోల్ కోసం మొరాకో ప్లేయర్స్ తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఫ్రాన్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్‌లో మూడింట రెండో వంతు బంతి తన నియంత్రణలోనే ఉన్నప్పటికీ.. మొరాకో గోల్స్ చేయడంలో పోర్తిగా విఫలమైంది. ఫలితంగా సెమీస్‌లో గోల్ ఖాతా తెరవకుండానే మొరాకో ఇంటిదారి పట్టింది. గ్రూప్ స్థాయి, నాకౌట్ మ్యాచుల్లో బెల్జియం, స్పెయిన్, పోర్చుగల్ లాంటి బలమైన జట్లనే ఓడించిన మొరాకో.. కీలక సెమీస్ మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది. అయితే ఆఫ్రికా నుంచి సెమీస్ చేరిన తొలి జట్టుగా మొరాకో ఓ రికార్డు నెలకొల్పింది.
FIFA World Cup 2022 | #MoroccoVsFrance semi-finals: Theo Hernandez and Randal Kolo Muani's goals help defending champions France beat Morocco 2-0 and enter the final.#FIFAWorldCup
(Pic: FIFA World Cup Twitter handle) pic.twitter.com/d5Or0jcTFI
— ANI (@ANI) December 14, 2022
మొదటి సెమీ ఫైనల్లో అద్భుతమైన ఆటతీరుతో అర్జెంటీనా ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ, జులియన్ అల్వరెజ్ అద్భుతం చేయడంతో.. 3-0 తేడాతో అర్జెంటీనా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మెస్సీ (34ని), జులియన్ అల్వరెజ్(39ని, 69ని) గోల్స్ చేశారు. మూడున్నర దశాబ్దాల అర్జెంటీనా సుదీర్ఘ కలను సాకారం చేసుకునే అవకాశం ముందుంది. అర్జెంటీనా, ఫ్రాన్స్ బలంగా ఉండడంతో ఫిఫా వరల్డ్ కప్ 2022 ట్రోఫీ ఎవరు గెలుస్తారో అని ఆసక్తి నెలకొంది.
Also Read: Venus Transit 2022: శుక్ర సంచారం.. ఈ రాశుల వారికి నూతన సంవత్సరంలో ప్రమోషన్‌తో పాటు ధనలాభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.