IND vs ENG: నిన్న ఇంగ్లండ్, భారత్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈమ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ సరికొత్త ప్రయోగం చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అయిన రిషబ్ పంత్‌ను ఓపెనర్‌గా పంపింది. రోహిత్‌తో కలిసి పంత్ ఇన్నింగ్స్ నడిపారు. వీరిద్దరూ తొలి ఐదు ఓవర్లలో దాడిగా ఆడారు.
ఈక్రమంలో స్టేడియంలో ఆసక్తికర ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. పంత్ సింగిల్ తీసే క్రమంలో ఇంగ్లండ్ బౌలర్ డేవిడ్ మిల్లీ అడ్డుగా వచ్చాడు. దీంతో పంత్ సామ్నేఆ గయా థా..టక్కర్ మార్ దు క్యా అంటే తెలుగులో నా ముందుకు వస్తున్నాడు..ఢీకొట్టామంటవా అంటూ రోహిత్ శర్మను అడిగాడు. దీనికి టీమిండియా కెప్టెన్ తిరిగి సమాధానం ఇచ్చాడు.
మార్ దే..ఔర్ క్యా(కొట్టు..ఇకేముందు) అని బదులు ఇచ్చాడు. ఇప్పుడా వీడియో తెగ వైరల్ అయ్యింది. నెటిజన్లు సైతం విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. ఐదో టెస్ట్ మ్యాచ్‌లో ఘోరంగా ఓడిన టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. రెండు టీ20 మ్యాచ్‌ల్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అదరగొట్టి ఔరా అనిపించింది. ఇవాళ చివరి టీ20 జరగనుంది.
ఆ తర్వాత వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. భారత్ జట్టు ఫామ్‌ను చూస్తే ఇంగ్లండ్ జట్టు గెలవడం కష్టంగానే ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈసిరీస్ పూర్తిగానే టీమిండియా..విండీస్, జింబాబ్వే టూర్‌కు వెళ్లనుంది. ఆ తర్వాత ఆసియా కప్ -2022 ప్రారంభమవుతుంది. అక్టోబర్‌లో టీ20 వరల్డ్ కప్ జరుగుతుంది. మొత్తంగా ఈఏడాది టీమిండియా బీజీ బీజీగా గడపనుంది.
Also read:Shinzo abe:ఇలా చేస్తే షింజో అబే బతికేవారు.. భద్రతా వైఫల్యమే కారణమన్న ఆనంద్ మహీంద్రా
Also read:Southwest Monsoon: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు..ఆయా రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook