India-West Indies Tour: టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియా మరో ద్వైపాక్షిక సిరీస్ ఆడనుంది. ఈ విషయాన్ని ట్రినిడాట్ అండ్ టొబాగో వెబ్ సైట్ తెలిపింది. విండీస్‌లో పర్యటించనున్న భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. ఈ సిరీస్ జూలై 22 నుంచి ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో మూడు వన్డేలు, బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయని వార్తలు వస్తున్నాయి.
ఐతే ఈ విషయిన్ని ఇరుదేశాల క్రికెట్ బోర్డులు ధృవీకరించలేదు. రేపటి నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 15వ సీజన్ రెండు నెలలపాటు కొనసాగనుంది. జూన్ 9 నుంచి 19 వరకు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం ఐర్లాండ్ పర్యటనకు భారత్ వెళ్తుంది. ఆ తర్వాత విండీస్ టూర్ ఉండే అవకాశం ఉంది. గత నెల భారత్‌లో విండీస్ జట్టు పర్యటించింది. వన్డే, టీ20 సిరీస్‌లను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది.
కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చిన తర్వాత భారత్ వరుస విజయాలను నమోదు చేస్తోంది. స్వదేశంలో వరుసగా సిరీస్‌లను కైవసం చేసుకుంటోంది. కోచ్ రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో ఈసారి టీ20 ప్రపంచకప్ సాధించాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే యువ క్రికెటర్లను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఇటీవల జరిగిన సిరీస్‌ల్లోనూ యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈఏడాది చివరిలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో యువకులతో బరిలోకి దిగాలని టీమిండియా యోచిస్తోంది.
Also Read: Live in Relationship Certificate: 28 ఏళ్ల యువకుడితో 67 ఏళ్ల మహిళ ప్రేమాయణం.. సహజీవనం కోసం నోటరీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook