Harbhajan Singh Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన భారత స్పిన్నర్!!

టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. క్రికెట్‌లోని అన్ని రకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా హర్భజన్ రిటైర్మెంట్ ప్రకటించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2021, 04:11 PM IST
  • అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన భారత స్పిన్నర్
  • రిటైర్మెంట్ ప్రకటించిన హర్భజన్ సింగ్
  • అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన హర్భజన్ సింగ్
 Harbhajan Singh Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన భారత స్పిన్నర్!!

టీమిండియా (India) వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. క్రికెట్‌లోని అన్ని రకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా హర్భజన్ తన రిటైర్మెంట్ (Harbhajan Singh Retirement) విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. జీవితంలో నాకు అన్నింటినీ అందించిన ఆటకు వీడ్కోలు పలుకుతున్నా, 23 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని చిరస్మరణీయంగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని హర్భజన్ ట్వీట్ చేశారు. 

'ప్రతి మంచి పనికి ఓ ముగింపు ఉంటుంది. జీవితంలో నాకు అన్నింటినీ అందించిన ఆటకు ఈ రోజు వీడ్కోలు పలుకుతున్నా. ఈ 23 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని అందంగా మరియు చిరస్మరణీయంగా మార్చిన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు అండగా నిలిచిన అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు' అని హర్భజన్ సింగ్ (Harbhajan Singh) ట్వీట్ చేశారు. టీమిండియా తరఫున హర్భజన్ 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు ఆడారు. టెస్టుల్లో 417, వన్డేల్లో 269, టీ20ల్లో 25 వికెట్లు పడగొట్టారు. ఓవరాల్‌గా భజ్జీ 711 అంతర్జాతీయ వికెట్లను ఖాతాలో వేసుకున్నారు. 

Also Read: Alia Bhatt - Ranbir Kapoor: అలియా భట్.. రణ్‌బీర్‌ కపూర్‌ ఏమైనా తాగి ఉన్నాడా?

1998లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగ్రేటం చేసిన హర్భజన్ సింగ్.. 2016లో చివరి మ్యాచ్ ఆడారు. 2016 నుంచి 41 ఏళ్ల భజ్జీ.. మళ్లీ భారత జట్టులోకి రాలేదు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్ల రాకతో హర్భజన్ జట్టులో చోటు కోల్పోయారు. అయితే గతేడాది వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో మాత్రం ఆడారు. ఐపీఎల్‌లో చెన్నై, కోల్‌కతా, ముంబై జట్ల తరఫున ఆడారు. సుదీర్ఘ కాలం ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడి తన ప్రదర్శన చేశారు. 

దాదాపు 23 ఏళ్ల కెరీర్‌లో హర్భజన్‌ సింగ్‌ (Harbhajan Singh) ఎన్నో రికార్డులు తన పేరుపై రాసుకున్నారు. భారత్ (Team India) తరఫున అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన వారిలో హర్భజన్‌ (417) నాలుగో స్థానంలో ఉన్నారు. బంతితో పాటు బ్యాటుతోనూ భజ్జీ రాణించారు. అన్ని ఫార్మాట్లు కలిపి 3500కుపైగా పరుగులు చేశారు. సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కెప్టెన్సీలో 2003 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై ఓడిన భారత జట్టులో ఉన్న హర్భజన్‌.. ఎంఎస్ ధోనీ (MS Dhoni) సారథ్యంలో 2011లో శ్రీలంకపై గెలిచిన ప్రపంచకప్‌ (2011 World Cup)లో కూడా ఉన్నారు. ప్రస్తుతం హర్భజన్‌ వ్యాఖ్యాతగా కెరీర్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. 

Also Read: Jr NTR, Ram Charan fun : ఫుడ్ ఛాలెంజ్‌లో హెస్ట్‌తో కలిసి ఎన్టీఆర్, రామ్ చరణ్ రచ్చ రచ్చ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News