Shubman Gill: శుభ్‌మన్ గిల్ మరో ఘనత...'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌' అవార్డుకు ఎంపిక..

Shubman Gill: టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ ను ఐసీసీ అవార్డు వరించింది. జనవరి నెలకుగానూ అతడు 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌' పురస్కారానికి ఎంపికయ్యాడు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2023, 11:05 AM IST
Shubman Gill: శుభ్‌మన్ గిల్ మరో ఘనత...'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌' అవార్డుకు ఎంపిక..

ICC Men's Player of the Month award: ఇటీవలే న్యూజిలాండ్‌పై అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించిన భారత క్రికెటర్ శుభ్‌మన్ గిల్... జనవరి నెలకు గానూ 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌' అవార్డుకు ఎంపికయ్యాడు. గిల్... తన సహచర ప్లేయర్ మహ్మద్ సిరాజ్, కివీస్ ఆటగాడు కాన్వేలను వెనక్కినెట్టి ఈ పురస్కారం గెలుచుకున్నాడు. ఈ అవార్డును అందుకోవడం గిల్ కు ఇదే తొలిసారి. గత నెలలో అతడు మూడు సెంచరీలతో సహా 567 పరుగుల సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. వన్డే ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా గిల్ రికార్డు సృష్టించాడు. రెండు సెంచరీలు కివిసీ పై, ఒక సెంచరీ శ్రీలంకపై సాధించాడు. 

ఈ అవార్డు గెలుచుకోవడంపై గిల్ స్పందించాడు. తనను సపోర్టు చేసిన సహచర ఆటగాళ్లు మరియు కోచ్‌లకు అతడు ధన్యవాదాలు తెలిపాడు. ఈ అవార్డును గత ఏడాది అక్టోబరులో విరాట్ కోహ్లీ అందుకున్నాడు.  ఇక మహిళల విభాగంలో జనవరి నెలకు గానూ ఫ్లేయర్ ఆఫ్ ది మంత్ పురస్కారాన్ని ఇంగ్లాండ్ ఫ్లేయర్ స్క్రీవెన్స్ ను వరించింది. గత నెలలో జరిగిన అండర్-19 ప్రపంచకప్ లో ఆమె అద్భుత ప్రతిభ కనబరిచింది. ఈ అవార్డు గెలుచుకున్న అతి పిన్న వయస్సు క్రికెటర్ గా రికార్డు నెలకొల్పింది. 

Also Read: WPL Auction 2023: డబ్ల్యూపీఎల్‌ 2023 వేలం.. అత్యధిక ధర పలికిన టాప్‌ 10 ప్లేయర్లు వీరే! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News