India vs West Indies: బౌలింగ్‌లో దుమ్మురేపుతున్న హార్దిక్ పాండ్యా..తాజాగా సరికొత్త రికార్డు..!

India vs West Indies: విండీస్‌ గడ్డపై టీ20 సిరీస్‌ రసవత్తరంగా సాగుతోంది. నువ్వానేనా అన్నట్లు ఇరుజట్లు తలపడుతున్నాయి. ఈక్రమంలో భారత స్టార్ ఆల్‌రౌండర్ అరుదైన రికార్డు సాధించాడు.

Written by - Alla Swamy | Last Updated : Aug 3, 2022, 04:42 PM IST
  • విండీస్‌లో భారత జట్టు
  • టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యం
  • పాండ్యా ఖాతాలో మరో రికార్డు
India vs West Indies: బౌలింగ్‌లో దుమ్మురేపుతున్న హార్దిక్ పాండ్యా..తాజాగా సరికొత్త రికార్డు..!

India vs West Indies: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. తన బౌలింగ్‌తో అద్భుతాలు చేస్తున్నాడు. తాజాగా మరో రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో మొత్తం నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసి..కేవలం 19 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఈమ్యాచ్‌లో కీలక వికెట్‌ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడి ఖాతాలో సరికొత్త రికార్డు చేరింది. 

భారత్ తరపున టీ20ల్లో 50 వికెట్లు తీశాడు. మొత్తంగా 800 పరుగులు చేయడంతోపాటు 50 వికెట్లు తీసిన ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో చేరిపోయాడు. ఈనేపథ్యంలో వెస్టిండీస్ దిగ్గజం బ్రావో, బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌ సరసన చేరాడు. ఈ రికార్డు సాధించిన స్టార్ ఆల్‌రౌండర్‌గా హార్ధిక్ పాండ్యా నిలిచాడు. షకీబ్ అల్ హసన్ 2 వేల 10 పరుగులు చేయడంతోపాటు 121 వికెట్లు తీశాడు. ఆఫ్రిది 14 వందల 16 పరుగులు, 98 వికెట్లు పడగొట్టాడు. డ్వేన్ బ్రావో 12 వందల 55 పరుగులతోపాటు 78 వికెట్లు తీశాడు.

భారత ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా 806 పరుగులు చేసి..50 వికెట్లు పడగొట్టాడు. మూడో టీ20లో బౌలింగ్‌లో రాణించినా..బ్యాటింగ్‌లో తేలిపోయాడు. మొత్తంగా ఈమ్యాచ్‌లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది. మొత్తంగా గాయాల నుంచి కోలుకున్న హార్ధిక్ పాండ్యా ..ఐపీఎల్‌లోనూ రఫాడించాడు. బౌలింగ్, బ్యాటింగ్, కెప్టెన్‌గా రాణించాడు. 

ఎంట్రీతోనే గుజరాత్‌కు కప్పు అందించిన ఘనత పాండ్యాకే దక్కుతుంది. అనంతరం ప్రతి సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎంపిక అవుతున్నాడు. ఐర్లాండ్‌ టూర్‌లో టీమిండియాను నడిపించాడు. రెండు మ్యాచ్‌ల్లో ఐర్లాండ్‌పై భారత జట్టు ఘన విజయం సాధించింది. ప్రస్తుతం టీమిండియాలో కీలక ప్లేయర్‌గా మారాడు. భారత జట్టుకు పాండ్యా, జడేజా, అశ్విన్ రూపంలో మంచి ఆల్‌రౌండర్లు దొరికారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 

Also read:Naga Chaitanya: నాగ చైతన్య, సమంత కలిసి నటించబోతున్నారా..చైతూ ఏమన్నాడంటే..!

Also read:Minister Harish Rao: ఎయిమ్స్ కంటే పీహెచ్‌సీలు మేలు..కేంద్రంపై మంత్రి హరీష్‌రావు హాట్ కామెంట్స్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News