World Cup 2023 Final: ప్రపంచకప్ 2023 ఫైనల్ బరిలో దూసుకొచ్చినా ప్రత్యర్ది ఆస్ట్రేలియా కావడంతో టీమ్ ఇండియా క్రికెట్ అభిమానుల్లో ఏదో మూల ఆందోళన వెంటాడుతోంది. 2003 రిపీట్ కాకూడదని బలంగా కోరుకుంటున్నారు. అద్భుతమైన ఫామ్ కలిగి ఉన్నా సరే..కంగారూలను తక్కువ అంచనా వేయకూడదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రపంచకప్ 2023 ఫైనల్లో రెండు అత్యుత్తమ జట్లు తలపడనున్నాయి. ఆడిన అన్ని మ్యాచ్‌లలో విజయంతో టీమ్ ఇండియా ఈసారి ఆస్ట్రేలియా కంటే బలంగా కన్పిస్తోంది. టీమ్ ఇండియాలో ప్రతి ఒక్క ఆటగాడు అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండూ పటిష్టంగా ఉన్నాయి. ఫీల్డింగ్ కూడా మెరుగ్గా ఉంది. బ్యాటింగ్ లైనప్‌లో రోహిత్, గిల్, విరాట్, అయ్యర్, రాహుల్, సూర్య కుమార్ యాదవ్, జడేజాలు తిరుగులేకుండా ఉన్నారు. ఇక బౌలింగ్‌లో షమీ, సిరాజ్, బూమ్రా పేస్‌కు తిరుగులేదు. స్పిన్నర్లలో జడేజా, కుల్దీప్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు.
అందుకే టీమ్ ఇండియా ఈసారి కప్ గెలుస్తుందనే అంంచనాలున్నాయి. అయితే ప్రత్యర్ధి ఆస్ట్రేలియా కావడంతో ఏమరపాటు ఉండవద్దని హెచ్చరిస్తున్నారు మాజీ క్రికెటర్లు గవాస్కర్, గౌతమ్ గంభీర్ లు. ఎందుకంటే నాకౌట్ మ్యాచ్‌లు ఎలా ఆడాలో ఆస్ట్రేలియాకు బాగా తెలుసంటున్నారు. ఇండియా అంత బలంగా ఆ జట్టు లేకపోయినా మైండ్ గేమ్‌లో ఆస్ట్రేలియాను మించిన జట్టు మరొకటి లేదని అంటున్నారు. చివరి వరకూ పోరాడే సామర్ద్యం ఆసీస్ ఆటగాళ్లలో ఉంటుందని అంటున్నారు. అందుకే ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయవద్దంటున్నారు.
ఆస్ట్రేలియా ఆరంభంలో తడబడుతున్నా తరువాత మిడిల్ ఆర్డర్ నిలబడిపోతోందని. బౌలింగ్‌లో ప్రతి ఒక్కరూ ఏదో దశలో అద్బుతంగా రాణిస్తున్న సంగతి గుర్తుంచుకోవాలంటున్నారు గౌతమ్ గంభీర్. అందుకే ఆస్ట్రేలియాతో సమరం అంత ఈజీ కాదంటున్నారు. బరిలో దిగేముందు అన్ని లెక్కలు సరిచూసుకోవల్సిందేనంటున్నారు.
Also read: World Cup Final 2023: ఈసారి కప్ గెలిచేది ఆ జట్టే, జోస్యం చెప్పిన రవిశాస్త్రి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook