Team India captain Virat Kohli: టీమిండియా భవిష్యత్తుపై విరాట్ కోహ్లీ అంచనా ఇదే

Team India captain Virat Kohli: విరాట్ కోహ్లీ సారథ్యంలోని సీనియర్ అండ్ రెగ్యూలర్ క్రికెట్ జట్టు యూకేకు బయలుదేరింది. అక్కడ రెండు వారాలపాటు క్వారంటైన్‌లో ఉంటూ మానసికంగా సన్నద్దం అవుతారు. మరో భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. 

Written by - Shankar Dukanam | Last Updated : Jun 3, 2021, 12:35 PM IST
  • ఒకే సమయంలో రెండు జాతీయ క్రికెట్ జట్లను ఏర్పాటు
  • విరాట్ కోహ్లీ సారథ్యంలోని రెగ్యూలర్ క్రికెట్ జట్టు యూకేకు బయలుదేరింది
  • సౌతాంప్టన్ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్
Team India captain Virat Kohli: టీమిండియా భవిష్యత్తుపై విరాట్ కోహ్లీ అంచనా ఇదే

Team India captain Virat Kohlis : భారత క్రికెట్ నియంత్రణ మండలి మరోసారి ప్రయోగాలకు సిద్ధమైంది. గతంలో ఒకే సమయంలో రెండు జాతీయ క్రికెట్ జట్లను ఏర్పాటు చేసి, పర్యటనలకు పంపింది. కానీ ఫలితం మాత్రం ఆశించిన మేర లేకపోవడంతో పాటు రెండు భారత జట్లు దారుణంగా వైఫల్యం చెందాయి. అయితే భవిష్యత్తులో బీసీసీఐ ఇదే తీరుగా రెండు జట్లను రెండు వేర్వేరు సిరీస్‌లకు పంపిస్తుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు.

విరాట్ కోహ్లీ సారథ్యంలోని సీనియర్ అండ్ రెగ్యూలర్ క్రికెట్ జట్టు యూకేకు బయలుదేరింది. అక్కడ రెండు వారాలపాటు క్వారంటైన్‌లో ఉంటూ మానసికంగా సన్నద్దం అవుతారు. సౌతాంప్టన్ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జూన్ 18 నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభం కానుంది. యూకే పర్యటన నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), కోచ్ రవిశాస్త్రి మీడియాతో మాట్లాడారు. ప్రతి సందర్భంలోనూ క్వారంటైన్‌లో ఉంటే ఆటగాడి మానసిక పరిస్థితి దెబ్బతింటుందని, కొన్నిసార్లు మాత్రమే ఇందుకు పూర్తి స్థాయిలో ఆటగాళ్లు అలవాటు పడతారని పేర్కొన్నాడు.

Also Read: Babar Azam Engagement: పెళ్లికి సిద్ధమైన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్, వధువు ఎవరంటే

ఓ జట్టు తనతో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్, ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్ కోసం యూకేలో పర్యటనించనుందని కోహ్లీ తెలిపాడు. మరో భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించనుందని, పరిస్థితులలో ఏ మార్పు రాకపోతే భవిష్యత్తులోనూ బీసీసీఐ (BCCI) ఇదే విధంగా రెండు జట్లను ఒకేసారి వేర్వేరు పర్యటనలకు పంపిస్తుందని అభిప్రాయపడ్డాడు. కానీ ఓవైపు ఆటపై ఫోకస్ చేసే సమయలో క్వారంటైన్ లాంటివి ఆటగాళ్లకు అడ్డంకిగా మారుతున్నాయని చెప్పుకొచ్చాడు. దీని వల్ల సరైన ప్రాక్టీస్ లభించదని, ఏదో భిన్నమైన వాతావరణంగా ఉండాల్సి రావడంతో డిప్రెషన్ లాంటి సమస్యల బారిన పడే అవకాశాలున్నాయని చెప్పాడు.

Also Read: T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై BCCIకి ఐసీసీ డెడ్‌లైన్

ఆటగాళ్లు క్వారంటైన్‌లో ఉండటం, ఆపై మైదానంలోకి దిగి అత్యుత్తమ ప్రదర్శన చేయడం అంతా తేలిక కాదని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఆరు వారాలపాటు యూకేలో ఉంటూ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో రాణించడం జోక్ కాదన్నాడు. ఫిట్‌నెస్ ఉన్న ఆటగాళ్లు సైతం మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, కనుక వారు మేనే‌జ్‌మెంట్‌తో మాట్లాడి విశ్రాంతి తీసుకోవాలని సైతం సహచర క్రికెటర్లకు విరాట్ కోహ్లీ సూచించాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News