India vs England: టీమిండియాకు గుడ్‌న్యూస్..అందుబాటులోకి వచ్చిన స్టార్ ప్లేయర్..!

India vs England: ఇంగ్లండ్‌లో టీమిండియా టూర్ కొనసాగుతోంది. ఇంగ్లీష్‌ టీమ్‌తో భారత్‌ ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్‌ ఆడుతోంది. దీని తర్వాత టీ20, వన్డే సిరీస్‌ జరగనుంది. ఈక్రమంలో టీమిండియాకు గుడ్‌న్యూస్ అందింది.

Written by - Alla Swamy | Last Updated : Jul 3, 2022, 04:41 PM IST
  • ఇంగ్లండ్‌లో టీమిండియా టూర్
  • ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్‌ ఆడుతున్న భారత్
  • త్వరలో పరిమిత మ్యాచ్‌లు
India vs England: టీమిండియాకు గుడ్‌న్యూస్..అందుబాటులోకి వచ్చిన స్టార్ ప్లేయర్..!

India vs England: ఇంగ్లండ్‌లో టీమిండియా టూర్ కొనసాగుతోంది. ఇంగ్లీష్‌ టీమ్‌తో భారత్‌ ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్‌ ఆడుతోంది. దీని తర్వాత టీ20, వన్డే సిరీస్‌ జరగనుంది. ఈక్రమంలో టీమిండియాకు గుడ్‌న్యూస్ అందింది. కరోనా బారిన పడి ఐదో టెస్ట్ మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ కోలుకున్నాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో రోహిత్‌కు నెగిటివ్ తేలింది. దీంతో ఇంగ్లండ్‌ తదుపరి జరగబోయే టీ20,వన్డే మ్యాచ్‌ల్లో అతడు ఆడనున్నాడు.

ఈనెల 7న ఎడ్జ్‌బస్టన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్‌ జరుగుతుంది. దీంతో పరిమితి మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభంకానుంది. ఇప్పటికే వన్డే,టీ20 సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇటీవల ఐర్లాండ్‌తో తలపడిన జట్టునే ఇంగ్లండ్‌తో జరగబోయే తొలి టీ20 మ్యాచ్‌కు సెలక్ట్ చేశారు. ఐదో టెస్ట్‌ మ్యాచ్‌లో ఆడుతున్న సీనియర్ ప్లేయర్లకు టీ20 మ్యాచ్‌ల నుంచి విశ్రాంతి కల్పించారు. 

ఇక వన్డే, టీ20లకు భారత జట్టు ఇలా ఉంది..

తొలి టీ20కి టీమిండియా జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్‌ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్‌ కార్తీక్(కీపర్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్‌ అయ్యర్, చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్‌, హర్షల్ పటేల్, అవేష్‌ ఖాన్, అర్షీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్

రెండు,మూడు టీ20లకు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, కోహ్లీ, సూర్యకుమార్ యావ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేష్‌ కార్తీక్, రిషబ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, బుమ్రా, భువనేశ్వర్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్

వన్డేలకు టీమిండియా జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యార్, రిషబ్ పంత్(కీపర్), పాండ్యా, జడేజా, శార్దూల్ ఠాకూర్, చాహల్, అక్షర్ పటేల్, బుమ్రామ, ప్రసిద్ కృష్ణ, షమీ, సిరాజ్, ఆర్షదీప్ సింగ్

Also read:Government Jobs: పదవ తరగతి పాసైతే చాలు..ఇండియా పోస్ట్‌లో 63 వేల జీతంతో ఉద్యోగం

Also read:BJP Vijaya Sankalpa Sabha Live Updates: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కలకలం.. సమావేశ హాల్లోకి తెలంగాణ ఇంటలిజెన్స్ అధికారులు

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News