Ishan Kishan: ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ రోహిత్ శర్మ రియాక్షన్ ఇదే.. రిప్లై మాత్రం అదుర్స్

Rohit Sharma On Ishan Kishan Double Century: టీమిండియా యంగ్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అతి చిన్న వయసులోనే ఈ మార్క్ చేరుకున్న ఇషాన్‌ను భవిష్యత్ ఆశాకిరణంగా పొగుడుతున్నారు. తాజాగా హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ కూడా స్పందించాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 11, 2022, 05:14 PM IST
Ishan Kishan: ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ రోహిత్ శర్మ రియాక్షన్ ఇదే.. రిప్లై మాత్రం అదుర్స్

Rohit Sharma On Ishan Kishan Double Century: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత యువ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ వన్డే క్రికెట్‌లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించి రికార్డులు బద్ధలు కొట్టాడు. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ గైర్హాజరీతో జట్టులోకి వచ్చిన కిషన్‌.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో టీమిండియాను క్లీన్‌స్వీప్ నుంచి గట్టెక్కించాడు. ఇషాన్ డబుల్ సెంచరీపై రోహిత్ శర్మ స్పందించాడు.

హిట్‌మ్యాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ఇషాన్ కిషన్ ఫొటోను పోస్ట్ చేసి.. 'ఈ క్లబ్ వినోదం భిన్నంగా ఉంటుంది ఇషాన్ కిషన్..' అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇషాన్ కిషన్ కూడా ఫన్నీగా సమాధానం ఇస్తూ.. 'ఇది సరదాగా ఉంది' అని అన్నాడు. ఇషాన్, రోహిత్ శర్మ ఇద్దరూ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ ఫేవరెట్ ప్లేయర్లలో ఇషాన్ కూడా ఉన్నాడు.

మూడో వన్డేలో గాయం కారణంగా రోహిత్ శర్మ ఆడలేకపోయాడు. దీంతో ఇషాన్ కిషన్‌కి ఛాన్స్ దక్కడంతో ఆ అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌తో తాను టీమిండియాకు బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్ అని నిరూపించుకున్నాడు. ఇషాన్ కేవలం 131 బంతుల్లో 210 పరుగులు చేశాడు. ఇందులో 10 భారీ సిక్సర్లు ఉన్నాయి. వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 

అతని కంటే ముందు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ ఈ ఘనత సాధించారు. వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్ భారత కెప్టెన్ రోహిత్ శర్మ. ఇషాన్‌ కిషన్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో మూడో వన్డేలో టీమిండియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 409 పరుగులు చేసింది. భారత్ తరఫున ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి ఇద్దరూ సెంచరీలు చేశారు. బౌలర్లు కూడా రాణించడంతో 227 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

Also Read: TS Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. శాఖల వారీగా భర్తీ చేసే పోస్టులు ఇవే..  

Also Read: Rajinikanth Birthday: తలైవా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రజనీకాంత్ బర్త్‌ డేకు స్పెషల్ గిఫ్ట్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News