Bangladesh Scripts Historic 2-1 ODI Series Win In South Africa: పసికూన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. పటిష్ట భారత జట్టు వైట్‌వాష్ అయిన దక్షిణాఫ్రికా గడ్డపై.. తొలిసారి వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. సెంటురియాన్ పార్క్ వేదికగా బుధవారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో బంగ్లా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ప్రొటీస్ గడ్డపై ఏ ఫార్మాట్‌లో అయినా బంగ్లాదేశ్‌కు ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం.
చివరిదైన మూడో వన్డేలో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 37 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ పేసర్ తస్కిన్ అహ్మద్ 5 వికెట్లతో ప్రొటీస్ జట్టును వణికించాడు. బంగ్లా బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. ఓపెనర్ జననేమన్ మలన్ (39) టాప్ స్కోరర్. కేశవ్ మహారాజ్ 28, డ్వైన్ ప్రిటోరియస్ (20), డేవిడ్ మిల్లర్ (16), క్వింటన్ డికాక్ (12) డబుల్ డిజిట్ స్కోర్ అందుకున్నారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 5, షకీబ్ ఉల్ హాసన్ 2 వికెట్లు తీశారు.
155 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ఆడుతూపాడుతూ చేధించింది. కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (87 నాటౌట్) సూపర్ హాఫ్ సెంచరీతో జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. బంగ్లా ఓపెనర్లు ఇక్బాల్, లిటన్ దాస్ (48) అద్భుతంగా ఆడారు. బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్మాన్ని అందించారు. హాఫ్ సెంచరీ ముందు దాస్ ఔట్ అయినా.. షకీబుల్ అండతో తమీమ్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. కేవలం 26.3 ఓవర్లలోనే బంగ్లాలక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంతో బంగ్లా వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన తస్కిన్ అహ్మద్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'తో పాటు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డు కూడా దక్కింది.
History for Bangladesh 🎉
They record their first-ever bilateral ODI series victory in South Africa with an emphatic nine-wicket win in the final match 👏 #SAvBAN pic.twitter.com/OJoAisR1OI
— ICC (@ICC) March 23, 2022
ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా గడ్డపై 3 వన్డేల సిరీస్ ఆడిన భారత్.. ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మూడు వన్డేల్లోనూ ఓటమిపాలై 0-3తో సిరీస్‌ను కోల్పోయింది. అంతకుముందు జరిగి టెస్టు సిరీస్‌లోనూ భారత్ ఓటమి పాలైంది. టెస్ట్ సిరీస్‌ను 1-2 తేడాతో ఓడింది. అదే ప్రొటీస్ గడ్డపై బంగ్లాదేశ్ వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. పటిష్ట భారత్ వల్ల కానిది.. పసికూన బంగ్లా చేసిచూపించింది. దాంతో బంగ్లా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Also Read: Gold and Silver Prices Today: తగ్గిన పసిడి ధర.. హైదరాబాద్‌లో తాజా బంగారం, వెండి రేట్లు ఇవే!!
Also Read: Today Horoscope March 24 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఉద్యోగ ప్రాప్తి ఉంది!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
BAN vs SA: టీమిండియా వైట్‌వాషైన చోట.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్!!
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్
తొలిసారి వన్డే సిరీస్ కైవసం
తస్కిన్ అహ్మద్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'