T20 World cup-2022: ఆకట్టుకుంటున్న టీ20 ప్రపంచకప్ ప్రొమో..తొలి ప్లేయర్ అతడే..!

T20 World cup-2022: టీ20 వరల్డ్ కప్‌-2022కు రంగం సిద్ధమవుతోంది. ఈఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా మెగా టోర్నీ జరగనుంది. ఇందుకు ఐసీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

Written by - Alla Swamy | Last Updated : Jul 10, 2022, 03:13 PM IST
  • అక్టోబర్‌లో టీ20 ప్రపంచ కప్
  • తాజాగా ప్రోమో విడుదల
  • ఆకట్టుకున్నఆటగాళ్ల వీడియో
T20 World cup-2022: ఆకట్టుకుంటున్న టీ20 ప్రపంచకప్ ప్రొమో..తొలి ప్లేయర్ అతడే..!

T20 World cup-2022: టీ20 ప్రపంచ కప్ నుంచి మరో వార్త బయటకు వచ్చింది. మరికొద్ది నెలల్లో ఈమెగా టోర్నీ ప్రారంభమవుతుంది. ప్రపంచ కప్ కోసం యావత్తు క్రికెట్ లోకం ఎదురుచూస్తోంది. ఈక్రమంలో ఐసీసీ గుడ్‌ న్యూస్ చెప్పింది. ప్రపంచ కప్‌కు సంబంధించిన ప్రొమోను విడుదల చేసింది. వీడియోలో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ ప్రత్యేక ఆకర్షణ నిలిచాడు. 

సముద్రంలో అలజడి ఏర్పడి అందులో నుంచి పంత్ వచ్చేలా ప్రోమోను తయారు చేశారు. ఆ తర్వాత ఇతర దేశాల క్రికెటర్లు ఒక్కొక్కరుగా వస్తారు. ఇందుకు సంబంధించిన వీడియో అద్భుతంగా ఉంది. విడుదల అయిన కాసేపటికే సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈసారి వరల్డ్ కప్‌లో టీమిండియా ఫెవరేట్‌గా ఉంది.

ప్రసుత్తం భారత్ జట్టు ..ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ ముగిసింది. మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. మూడో మ్యాచ్‌ ఇవాళ జరగనుంది. ఆ తర్వాత భారత జట్టు వెస్టిండీస్, జింబాబ్వే టూర్‌కు వెళ్లనుంది. ఆ వెంటనే శ్రీలంక వేదికగా ఆసియా కప్-2022 జరగనుంది. అక్టోబర్‌లో టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. ఇప్పటికే భారత జట్టు కూర్పుపై బీసీసీఐ దృష్టి పెట్టింది. ఈసారి ఎలాగైన కప్‌ కొట్టాలని టీమిండియా భావిస్తోంది.

Also read:Pawan Kalyan: అధికార మదంతో అలా చేస్తే తాటా తీస్తా..వైసీపీ నేతలకు పవన్ హెచ్చరిక..!

Also read:IND vs ENG: ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా జైత్రయాత్ర..రెండో టీ20లో ఆసక్తికర ఘటన..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News