IND vs PAK: అభిమానులకు గుడ్‌న్యూస్‌.. భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్ టికెట్లను విడుదల చేసిన ఐసీసీ!

Standing room tickets released for India vs Pakistan Clash. భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు సంబంధించి మరో 4 వేలకు పైగా స్టాండింగ్‌ రూమ్‌ టికెట్లను తాజాగా ఐసీసీ విడుదల చేసింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 25, 2022, 04:18 PM IST
  • అభిమానులకు గుడ్‌న్యూస్‌
  • భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్ టికెట్లను విడుదల చేసిన ఐసీసీ
  • ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లు కూడా
IND vs PAK: అభిమానులకు గుడ్‌న్యూస్‌.. భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్ టికెట్లను విడుదల చేసిన ఐసీసీ!

ICC released India vs Pakistan Standing room tickets: ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ 2022 జరగనున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్‌ 23న మరోసారి దాయాదుల పోరు జరగనుంది. భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు సంబంధించి ఫిబ్రవరిలో టికెట్లు విడుదల చేయగా.. హాట్ కేకుల్లా మ్ముడుపోయాయి. కేవలం ఐదు నిమిషాల్లోనే టికెట్స్ అన్ని ఖతం అయ్యాయి. అయితే ఈ మ్యాచ్ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా స్టాండింగ్‌ రూమ్‌ టికెట్లను విడుదల చేసింది. 

భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు సంబంధించి మరో 4 వేలకు పైగా స్టాండింగ్‌ రూమ్‌ టికెట్లను తాజాగా ఐసీసీ విడుదల చేసింది. ఒక్కో టికెట్‌ 30 ఆస్ట్రేలియన్ డాలర్లకు (దాదాపు రూ.1670) ఫస్ట్‌ కమ్‌ - ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిలో కేటాయిస్తామని ఐసీసీ వెల్లడించింది. 'భారత్, పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు మరింత మంది అభిమానులకు అవకాశం కల్పిస్తున్నాం. అందుకోసం 4 వేలకుపైగా స్టాండింగ్‌ రూమ్‌ టికెట్లను కేటాయించాం. అక్టోబర్‌ 23న (ఆదివారం) దాయాది దేశాల మధ్య మ్యాచ్‌ జరగనుంది' అని ఐసీసీ ప్రతినిధులు తెలిపారు. 

'ఐసీసీ హాస్పిటాలిటీ, ఐసీసీ ట్రావెల్స్ అండ్ టూర్స్‌ ప్రోగ్రామ్స్‌ తరఫున పరిమిత సంఖ్యలో ప్యాకేజీలను కూడా అందుబాటులో ఉన్నాయి. టీ20 ప్రపంచకప్‌ 2022లో ఇతర దేశాల మ్యాచ్‌లను చూసేందుకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. పిల్లలకు 5 ఆస్ట్రేలియన్‌ డాలర్లు, పెద్దలకు 20 డాలర్ల నుంచి ప్రారంభమవుతాయి. నవంబర్ 13న జరిగే టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి' అని ఐసీసీ ప్రతినిధులు స్పష్టం చేశారు.

Also Read: Conspiracy on Liger: లైగర్-విజయ్ దేవరకొండపై కుట్ర..కావాలనే నెగటివ్ టాక్..వారి పనేనా?

Also Read: Asia Cup 2022: ఆసియా కప్‌ 2022కు ముందు పాక్ కీలక నిర్ణయం.. రషీద్‌ వచ్చేశాడు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News