India vs Afghanistan: చావా రేవో..టీమ్ కీలక మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్‌తో నేడే

India vs Afghanistan: టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా చావా రేవో తేల్చుకోవల్సిన మ్యాచ్ ఇది. వరుస రెండు ఓటములతో అడుగంటిన సెమీస్ ఆశల్ని చిగురింపజేయాలంటే గెలవక తప్పని మ్యాచ్. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ టీమ్ ఇండియా మ్యాచ్ కోసం సన్నద్ధమవుతోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 3, 2021, 07:37 AM IST
  • టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ కీలక మ్యాచ్ నేడే
  • చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమైన టీమ్ ఇండియా
  • అశ్విన్ తుది జట్టులో ఉండే అవకాశాలు
India vs Afghanistan: చావా రేవో..టీమ్ కీలక మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్‌తో నేడే

India vs Afghanistan: టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా చావా రేవో తేల్చుకోవల్సిన మ్యాచ్ ఇది. వరుస రెండు ఓటములతో అడుగంటిన సెమీస్ ఆశల్ని చిగురింపజేయాలంటే గెలవక తప్పని మ్యాచ్. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ టీమ్ ఇండియా మ్యాచ్ కోసం సన్నద్ధమవుతోంది.

ICC T20 World Cup 2021లో టీమ్ ఇండియా(Team India) వరుస పరాజయాలతో ఘోర విమర్శలు ఎదుర్కొంటోంది. వరుసగా తొలి రెండు మ్యాచ్‌లను పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లపై ఓడిపోవడంతో సెమీఫైనల్స్ ఆశలు ఇండియాకు దాదాపుగా సన్నగిల్లాయి. ఇప్పుడిక ఇండియాకు మిగిలిన మూడు మ్యాచ్‌లలో తప్పనిసరిగా గెలవడమే కాకుండా, ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉండటం మిగిలింది. ఇతర జట్ల జయాపజయాల సంగతెలా ఉన్నా టీమ్ ఇండియా మాత్రం ఇవాళ జరగనున్న మ్యాచ్‌లో గెలవక తప్పని పరిస్థితి. 

అబుదాబి వేదికగా ఇవాళ టీమ్ ఇండియా కీలకమైన తన మూడవ మ్యాచ్‌ను ఆఫ్ఘనిస్తాన్‌తో(Afghanistan) ఆడనుంది. వరుస రెండు పరాజయాలతో ఆత్మ విశ్వాసం కోల్పోయిన టీమ్ ఇండియాను దెబ్బకొట్టాలని ఆఫ్ఘనిస్తాన్ ఎదురుచూస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌పై ఘన విజయం సాధించి సెమీస్ అవకాశాల్ని(Semi finals Chances)చిగురింపజేసుకోవాలని ఇండియా భావిస్తోంది. ఆన్‌పేపర్ విషయానికొస్తే బలమైన బ్యాటింగ్ ఆర్డర్ కలిగిన టీమ్ ఇండియా క్షేత్రస్థాయిలో విఫలమవుతోంది. ఈ నేపధ్యంలో ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడే జట్టు కూర్పు ప్రదానంగా మారింది. ఎందుకంటే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టు కూర్పు, బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పుపై కెప్టెన్ విరాట్ కోహ్లిపై విమర్శలు వచ్చాయి. అశ్విన్‌ను తీసుకోకపోవడంపై టీమ్ ఇండియా మాజీ సెలెక్టర్ వెంగ్‌సర్కార్ విమర్శలు చేయడం, బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar)ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే.

ఇవాళ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో మరోసారి రోహిత్ శర్మ(Rohit Sharma), కేఎల్ రాహుల్ ఓపెనింగ్ దిగే అవకాశాలున్నాయి. ఫిట్నెస్ సమస్యలున్న సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో వస్తాడా లేదా అనేది ఇంకా తెలియదు. పెద్దగా రాణించని హార్దిక్ పాండ్యాను పక్కనబెట్టే అవకాశాలున్నాయి. మిస్టరీ స్పిన్నర్‌గా ఉన్న వరుణ్ చక్రవర్తిని ఆడిస్తారా లేదా తప్పించి అశ్విన్‌ను తీసుకుంటారా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. అటు స్కాట్లండ్, నమీబియా జట్లపై ఘన విజయాన్ని నమోదు చేసిన ఆఫ్ఘనిస్తాన్ మంచి ఊపుతో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లుగా ఉన్న హజ్రతుల్లా జజాయ్, మొహమ్మద్ షెజాద్‌లు ఫుట్‌వర్క్ విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో అశ్విన్‌ను (Ashwin)ఆడిస్తే ఇండియాకు కలిసి రావచ్చనేది ఓ అంచనా. 

ఇక టాస్ గెలిస్తే టీమ్ ఇండియా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలున్నాయి. లేదా తొలుత బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం భారీ లక్ష్యాన్ని నిర్దేశించాల్సి ఉంటుంది. ఏదైనా సరే టీమ్ ఇండియా సెమీస్ ఆశలు పూర్తిగా నీరుగారకుండా ఉండాలంటే ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌ను ఇండియా గెలవక తప్పని పరిస్థితి.

Also read: T20 World Cup 2021: నమీబియాపై ఘన విజయంతో సెమీస్‌కు చేరిన పాకిస్తాన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News