Suryakumar Yadav - Yuzvendra Chahal Viral Video: భారత్ - శ్రీలంక మధ్య జరిగిన T20 సిరీస్ చివరి మ్యాచ్‌లో, సూర్యకుమార్ యాదవ్ తనదైన బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. ఆయన సూపర్బ్ ఇన్నింగ్స్ కారణంగానే గత మ్యాచ్‌లో టీమిండియా 91 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ తర్వాత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సూర్యకుమార్‌తో కలిసి చేసిన పనిని మీరు కళ్లతో చూస్తే కానీ నమ్మరు. ఈ ఇద్దరు ఆటగాళ్లకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ముందుగా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌ను ప్రశంసించాడు. ఈ సమయంలో ఆయన చేసిన పనిని కొందరు షూట్ చేయగా, ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. చాహల్ ముందుగా సూర్యకుమార్ చేతులను ఒక్కొక్కటిగా రెండు కళ్లనూ తాకించుకుని ఆ తరువాత ముద్దుపెట్టినట్టు వీడియోలో చూడవచ్చు. ఇక ఈ ఇద్దరు క్రికెటర్ల అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగి 51 బంతులు ఎదుర్కొని 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సెంచరీ ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ 7 ఫోర్లు, 9 సిక్సర్లు బాదడంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన రెండో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇక అంతకు ముందు రోహిత్ శర్మ పేరిట 4 సెంచరీలు ఉండగా, సూర్యకుమార్‌కు ఇది మూడో సెంచరీ.
ఇక ఈ మ్యాచ్‌లో చాహల్ కూడా బాగా బౌలింగ్ చేసి తన మూడు ఓవర్లలో 30 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. 14 బంతుల్లో 22 పరుగులు చేసి ప్రమాదకరంగా కనిపిస్తున్న ధనంజయ్ డిసిల్వా వికెట్ ను కూడా చాహల్ తీశాడు. అంతే కాకుండా చరిత అసలంకను కూడా పెవిలియన్ దారి చూపించాడు. అసలంక 19 పరుగులు చేశాడు. ఇక ఆ మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ గురించి యుజ్వేంద్ర చాహల్ మాట్లాడుతూ, ' సూర్యకుమార్ ప్రత్యర్థి జట్టులో లేకపోవడం తన అదృష్టమని చాహల్ ప్రకటన చేశాడు.
ఇక సూర్యకుమార్ టీ 20లో మూడు సెంచరీలు సాధించగా, ఆరు నెలల్లోనే ఈ ఘనత సాధించాడు. ఆయన 10 జూలై 2022న నాటింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌పై మొదటి T20 సెంచరీని సాధించాడు. అదే సమయంలో, రెండవ సెంచరీ 20 నవంబర్ 2022న న్యూజిలాండ్‌పై మౌంట్ మౌంగానుయ్‌లో నమోదవగా ఆ తర్వాత, శ్రీలంకపై సెంచరీ సాధించాడు, ఇది భారతదేశంలో ఆయన మొదటి T20 సెంచరీ.
Also Read: YSRCP MLA Son: బాలయ్య సినిమాకు వైసీపీ ఎమ్మెల్యే కొడుకు ఫ్లెక్సీ.. ఇదేందయ్య ఇదీ!
Also Read: Fire accident: తెలంగాణాలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook