ICC Awards: పొట్టి క్రికెట్లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరుసగా రెండో ఏడాది టీ20 క్రికెట్లో ''ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ఆఫ్ ది ఈయర్''’ అవార్డు గెలుచుకున్నాడు. గతేడాది కూడా ఈ అవార్డు మిస్టర్ 360నే వరించింది. దీంతో ఈ పురస్కారం వరుసగా గెలుచుకున్న తొలి ఫ్లేయర్ గా సూర్య అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు కోసం సూర్యతోపాటు జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజా, న్యూజిలాండ్ బ్యాటర్ మార్క్ చాప్మన్, అల్పేశ్ రమ్‌జాని (ఉగాండా)లు పోటీ పడ్డారు. అయితే పొట్టి ఫార్మాట్ లో నిలకడగా రాణిస్తూనే సూర్యా భాయ్‌నే ఈ అవార్డు వరించింది. 2023లో సూర్య 17 ఇన్నింగ్స్‌లలోనే 48.86 సగటుతో 733 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. అతడి స్ట్రైక్ రేట్ 155.95గా నమోదైంది.
Presenting the ICC Men's T20I Cricketer of the Year 2023 😎🙌
Congratulations Surya Kumar Yadav 👏👏#TeamIndia | @surya_14kumar pic.twitter.com/7RuXwQu7Am
— BCCI (@BCCI) January 24, 2024
Also Read: India Vs England: రేపటి నుంచే ఇంగ్లండ్‌తో తొలి టెస్టు... కోహ్లీ స్థానంలో ఆర్సీబీ ఫ్లేయర్?
ఇటీవల ముగిసిన సఫారీ టూర్ లో సూర్య గాయపడ్డాడు. అతడి చీలమండ దెబ్బతింది. దీంతో అతడికి 'స్పోర్ట్స్ హెర్నియా'(Sports Hernia) సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో సూర్య శస్త్రచికిత్స కోసం జర్మనీకి వెళ్లాడు. అక్కడ సర్జరీ సక్సెస్ అవడంతో అందరికి సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్ సీజన్ నాటికి అందుబాటులో ఉండాలని భావిస్తున్నాడు.
Also Read: BCCI Awards: రవిశాస్త్రి, శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ అవార్డులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి