ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ఏకైక సమస్య అదే.. హుడాకు అవకాశం ఇస్తే సరిపోద్ది: సునీల్‌ గవాస్కర్

Sunil Gavaskar says Deepak Hooda is better Option for Hardik Pandya. టీ20 ప్రపంచకప్‌ 2022లో భారత్‌ను ఓ సమస్య వెంటాడుతోందని క్రికెట్  దిగ్గజం సునీల్‌ గవాస్కర్ అన్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 26, 2022, 11:37 AM IST
  • 7 బంతులు ఎదుర్కొని 4 రన్స్‌
  • ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ఏకైక సమస్య అదే
  • దీపక్ హుడాకు అవకాశం ఇస్తే సరిపోద్ది
ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ఏకైక సమస్య అదే.. హుడాకు అవకాశం ఇస్తే సరిపోద్ది: సునీల్‌ గవాస్కర్

Sunil Gavaskar says Deepak Hooda is better Option for Hardik Pandya: టీ20 ప్రపంచకప్‌ 2022లో భారత్‌ బోణీ కొట్టినా ఓ సమస్య వెంటాడుతోందని టీమిండియా దిగ్గజం సునీల్‌ గవాస్కర్ అన్నారు. విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్‌, హార్దిక్‌ పాండ్యా సమయోచిత ఇన్నింగ్స్‌తో చిరకాల ప్రత్యర్థి పాక్‌పై చిరస్మరణీ విజయం అందుకున్నా.. కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ భారత జట్టును ఆందోళనకు గురి చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని సన్నీ చెప్పారు. కొద్దిరోజులుగా విఫలమవుతున్న రోహిత్‌.. పాక్‌తో మ్యాచ్‌లోనూ రాణించలేదు. 7 బంతులు ఎదుర్కొని కేవలం 4 రన్స్‌ మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.

రోహిత్ శర్మతో పాటు మరో ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌ సైతం విఫలమయ్యాడు. పాక్‌పై నాలుగు పరుగులే చేసి ఔట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ముందు ఇవేమీ కనబడలేదు. ఈ అంశంపై సునీల్‌ గవాస్కర్ తాజాగా స్పందించారు. 'ప్రస్తుతం జట్టులో ఉన్న ఏకైక సమస్య రోహిత్‌ శర్మ ఫామ్‌. ఇటీవలి రోజుల్లో రోహిత్ స్థాయికి తగినట్లు ఆడటం లేదు. అతడు ఆడితే మిగతావారు బ్యాటింగ్ చేయడం సులువవుతుంది. మంచి ఓపెనింగ్‌ ఇస్తే.. ఆ తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి ఉండదు. క్రీజులోకి వచ్చే బ్యాటర్లకు మొదటి బంతి నుంచే హిట్టింగ్‌ చేసే అవకాశం ఉంటుంది. మంచి స్కోర్‌ కూడా వస్తుంది' అని సన్నీ అన్నారు. 

'పాక్‌పై కేఎల్ రాహుల్‌ సైతం విఫలమయ్యాడు. అతడు గాడిన పడాల్సిన అవరం ఉంది.రోహిత్, రాహుల్‌ చెలరేగితే చాలా బాగుంటుంది.  మెగా టోర్నీలోని తర్వాతి మ్యాచ్‌ల్లో మొదటి 6 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఉంటడమే కీలకం. నెమ్మదిగా బ్యాటింగ్‌ చేసినా వికెట్‌ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. క్రీజులో ఉంటే పరుగులు అవే వస్తాయి' అని టీమిండియా దిగ్గజం సునీల్‌ గవాస్కర్ పేర్కొన్నారు. భారత్‌ గురువారం తన తదుపరి మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచులో రిషబ్ పంత్, యుజ్వేంద్ర చహల్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. 

'హార్దిక్ పాండ్యాకు ఫిట్‌నెస్ సమస్యలు ఉంటే నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచులో విశ్రాంతి ఇవ్వండి. పాండ్యాకు రెస్ట్ ఇస్తే.. దీపక్ హుడాకు అవకాశం ఇస్తే సరిపోద్ది. వచ్చే ఆదివారం దక్షిణాఫ్రికాతో బిగ్ మ్యాచ్ ఉంది కాబట్టి ఎవరూ అసౌకర్యంగా ఉన్నా.. రెస్ట్ ఇచ్చి తాజాగా ఉండేలా చూసుకోండి. ఏడాది చాలా తక్కువ క్రికెట్ ఆడిన మహమ్మద్ షమీకి రెస్ట్ అవసరం లేదు. టీ20ల్లో ఏ జట్టును తేలిక తీసుకోకూడదు' అని సన్నీ సూచించారు. 

Also Read: Urvashi Rautela-Pant: ఊర్వశి ఊర్వశి అని ఎగతాళి చేసిన ఫాన్స్.. రిషబ్ పంత్ రియాక్షన్ చూస్తే నవ్వులే!  

Also Read: Kali Mata Temple Prasad Money: ప్రసాదం బదులుగా డబ్బులు పంచిన పూజారి.. ఎగబడ్డ జనాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News