బీసీసీఐ సెలక్టర్ల కమిటీ ముందు మాజీ క్రికెటర్ గవస్కర్ సరికొత్త ప్రతిపాదన పెట్టారు. కోచ్ ఇతర సిబ్బంది తరహానే కెప్టెన్సీ విషయంలో రీ అపాయింట్ చేయాలని సూచించారు. 2023 వరల్డ్ కప్ దృష్టి పెట్టుకొని అన్ని నియామకాలు చేపడుతున్నారు...కెప్టెన్సీ విషయంలోనూ ఇదే నిబంధన పాటిస్తే బాగుంటుందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
గవాస్కర్ మాట్లాడుతూ గత ఇంగ్లండ్ వరల్డ్ కప్ వరకు కోహ్లీని కెప్టెన్ గా కొనసాగించడం సరైన నిర్ణయమే..అయితే ఇప్పుడు భవిష్యత్తు అవసారలను దృష్టిలో పెట్టుకొని కెప్టెన్సీ ఎంపిక చేయాలన్నారు.ఆ ఆంగ్ల పత్రికలో తన సంపాదకీయంలో ఈ విషయాన్ని గవాస్కర్ వెల్లడించారు. వరల్డ్ కప్ గెలిచే అవకాశం వచ్చినప్పటికీ టీమిండియా ఆ ఛాన్స్ ను చేజార్చుకుంది. ఈ విషయంలో కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి పాత్ర ఉందంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవాస్కర్ వ్యాఖ్యలు చర్చనీయంశంగా మారాయి.