SLPL schedule: 5 క్రికెట్ జట్లు.. 15 రోజుల టీ20 టోర్నమెంట్

శ్రీలంక ప్రీమియర్‌ లీగ్‌ (SLPL) టీ20 టోర్నమెంట్‌ నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 6వ తేదీ వరకు జరుగుతుందని శ్రీలంక క్రికెట్‌ బోర్డు (SLC) స్పష్టంచేసింది. తొలుత నిర్ణయించుకున్న ఎస్ఎల్‌పీఎల్ షెడ్యూల్‌ ప్రకారం టీ20 టోర్నమెంట్ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 20 మధ్య జరగాల్సి ఉన్నప్పటికీ.. కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) కారణంగా అది వాయిదా పడుతూ వచ్చింది.

Last Updated : Sep 3, 2020, 05:54 PM IST
  • నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 6వ తేదీ వరకు శ్రీలంక ప్రీమియర్‌ లీగ్‌ (SLPL) టీ20 టోర్నమెంట్‌.
  • కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) కారణంగా వాయిదా పడుతూ వచ్చిన SLPL.
  • బరిలోకి దిగనున్న కొలంబో, కెండి, గల్లె, దంబుల్ల, జాఫ్న జట్లు.
  • 15 రోజుల వ్యవధిలో 23 మ్యాచ్‌ల్లో తలపడనున్న ఐదు జట్లు
SLPL schedule: 5 క్రికెట్ జట్లు.. 15 రోజుల టీ20 టోర్నమెంట్

హైదరాబాద్ : శ్రీలంక ప్రీమియర్‌ లీగ్‌ (SLPL) టీ20 టోర్నమెంట్‌ నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 6వ తేదీ వరకు జరుగుతుందని శ్రీలంక క్రికెట్‌ బోర్డు (SLC) స్పష్టంచేసింది. తొలుత నిర్ణయించుకున్న ఎస్ఎల్‌పీఎల్ షెడ్యూల్‌ ప్రకారం టీ20 టోర్నమెంట్ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 20 మధ్య జరగాల్సి ఉన్నప్పటికీ.. కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) కారణంగా అది వాయిదా పడుతూ వచ్చింది. Also read : Super Bowlers: ఐపిఎల్ లో అత్యధిక మేడిన్ ఓవర్లు వేసిన బౌలర్లు వీరే

కొలంబో, కెండి, గల్లె, దంబుల్ల, జాఫ్న జిల్లాల పేరిట ఐదు క్రికెట్ జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొననున్నాయి. రంగిరి దంబుల్లా, పల్లెకెలె, సూర్యవేవా మహింద రాజపక్సే అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాల్లో 15 రోజుల వ్యవధిలో ఐదు జట్ల మధ్య 23 మ్యాచ్‌లు జరగనున్నాయి. Also read : IPL 2020: యూఏఈలో మరోసారి కరోనా కలకలం

శ్రీలంక ప్రీమియర్‌ లీగ్‌ టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌ను నవంబర్‌ మొదటి వారంలోనే ప్రారంభించాలని భావించినప్పటికీ.. అది సాధ్యపడకపోవడంతో చివరకు నవంబర్ 14ను ప్రారంభ తేదీగా ఎంచుకున్నారు. శ్రీలంక ప్రీమియర్‌ లీగ్‌‌లో ( Sri Lanka Premier League ) వరల్డ్ క్లాస్ ప్లేయర్స్‌తో ఆడటం వల్ల లోకల్ ఆటగాళ్లు సైతం తమ ఆటను మెరుగు పర్చుకునే అవకాశం లభిస్తుందని శ్రీలంక క్రికెట్ బోర్డు అభిప్రాయపడింది.Also read : David Capel death: అనారోగ్యంతో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మృతి

Trending News