Lasith Malinga: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు లంక దిగ్గజం మలింగ వీడ్కోలు

Lasith Malinga: శ్రీలంక పేస్ దిగ్గజం లసిత్ మలింగ తాజాగా అంతర్జాతీయ టీ20 పోటీలకు వీడ్కోలు పలికాడు. మలింగ ఇదివరకే వన్డే, టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. తాజా నిర్ణయంతో అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి మలింగ పూర్తిగా తప్పుకున్నాడు. ఈ మేరకు మలింగ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 14, 2021, 08:02 PM IST
  • అన్ని ఫార్మాట్లకు లసిత్ మలింగ గుడ్ బై
  • శ్రీలంక క్రికెట్లో ప్రతిభావంతుడైన బౌలర్ గా గుర్తింపు
  • ఐదు హ్యాట్రిక్ లు నమోదు చేసి అరుదైన ఘనత
Lasith Malinga: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు లంక దిగ్గజం మలింగ వీడ్కోలు

Lasith Malinga Retires From All Forms:  శ్రీలంక యార్కర్‌ కింగ్‌  ల‌సిత్ మలింగ  అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వన్డే, టెస్టు ఫార్మట్‌ల నుంచి ఇదివరకే మలింగ(Lasith Malinga) తప్పుకున్నాడు. తాజా నిర్ణయంతో అంతర్జాతీయ క్రికెట్లోని(International Cricket) అన్ని ఫార్మాట్ల నుంచి మలింగ పూర్తిగా తప్పుకున్నట్లు అయింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా మంగళవారం పేర్కొన్నాడు. 2019లో వన్డేలనుంచి తప్పుకోగా, 2011లో టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.

Also Read: Brendan Taylor: ఇంటర్నేషనల్ క్రికెట్‌కి జింబాబ్వే స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్

రికార్డుల రారాజు..
అంతర్జాతీయ క్రికెట్లో ఐదు హ్యాట్రిక్ లు నమోదు చేసి అరుదైన ఘనత సాధించిన  బౌలర్ కూడా మలింగానే. వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లను రెండుసార్లు పడగొట్టిన రికార్డు కూడా మలింగ పేరిటే నమోదై ఉంది. ఐపీఎల్(IPL) లో మలింగ ఇప్పటికీ అత్యధిక వికెట్ల తీసిన ఆటగాడుగా కొనసాగుతున్నాడు. శ్రీలంక(Srilanka) తరుపున  84 టీ20 మ్యాచ్ లు ఆడిన మలింగా  107 వికెట్లు పడగొట్టాడు. 228 వన్డేల్లో 338 వికెట్లు తీసిన మలింగ, 30 టెస్టుల్లో 101 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు...122 ఐపీఎల్‌ మ్యాచ్‌ లు కూడా లసిత్‌ మలింగ ఆడాడు. మలింగ కెప్టెన్సీలో శ్రీలంక జట్టు 2014లో టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News