Sunrisers Hyderabad Won By 1 Run vs Rajasthan Royals: హైఓల్టేజ్ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విక్టరీ సాధించింది. రాజస్థాన్ రాయల్స్‌ను ఒక్క పరుగు తేడాతో ఓడించి ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. హెడ్ (58), నితీశ్ (76 నాటౌట్), క్లాసెన్ (42 నాటౌట్) చెలరేగి ఆడారు. 202 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 200 పరుగులు చేసి.. ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. పరాగ్ (77), జైస్వాల్ (67) హాఫ్ సెంచరీలతో పోరాడినా ఎస్‌ఆర్‌హెచ్‌నే విజయం వరించింది. ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు ఆరో విజయం కాగా.. రాజస్థాన్ రాయల్స్‌కు రెండో ఓటమి. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ టాప్ ప్లేస్‌లోనే ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్‌ను దాటేసి హైదరాబాద్ నాలుగోస్థానానికి చేరుకుంది.
Also Read: Revanth Reddy: తెలంగాణకు మోదీ ఇచ్చిందేమీ లేదు 'గాడిద గుడ్డు' తప్ప: రేవంత్ రెడ్డి
202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఆరంభంలో తడపడింది. భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్‌లోనే బట్లర్ (0), కెప్టెన్ సంజూ శాంసన్ (0)లను డకౌట్ చేసి రాజస్థాన్‌ను దెబ్బతీశాడు. అయితే ఓపెనర్ యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దూకుడుగా ఆడారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 134 జోడించడంతో రాజస్థాన్ విజయంవైపు దూసుకువచ్చింది. జైస్వాల్ (40 బంతుల్లో 67, 7 ఫోర్లు, 2 సిక్సర్లు)ను నటరాజన్ ఔట్ చేసి రేసులోకి తీసుకువచ్చాడు. రియాన్ పరాగ్ (49 బంతుల్లో 77, 8 ఫోర్లు, 4 సిక్సర్లు)ను కమిన్స్ ఔట్ చేయడంతో మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.
చివరి మూడు ఓవర్లు ఎస్‌ఆర్‌హెచ్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. 18వ ఓవర్‌లో నటరాజన్ 7 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగా.. 19వ ఓవర్‌లో కూడా కమిన్స్ 7 పరుగులు ఇచ్చి వికెట్ పడగొట్టాడు. ఇక చివరి ఓవర్‌లో విజయానికి 13 పరుగులు అవసరం అయ్యాయి. భువనేశ్వర్ వేసి ఈ ఓవర్‌లో తొలి రెండు బంతులకు 3 పరుగులు రాగా, నాలుగో బంతిని పావెల్ బౌండరీకి తరలించాడు. ఆ తరువాత రెండు బంతులకు నాలుగు పరుగులు రావడంతో ఒక బంతికి రెండు పరుగులు చేయాల్సి వచ్చింది. చివరి బంతికి పావెల్ (27)ను భూవీ ఎల్‌బీడబ్ల్యూ చేయడంతో ఎస్‌ఆర్‌హెచ్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ 3 వికెట్లు తీయగా.. నటరాజన్ 2, కమిన్స్ 2 వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 201 పరుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్ శర్మ (12), అన్మల్‌ప్రీత్ సింగ్ (5) తక్కువ స్కోరుకే ఔట్ అయినా.. హెడ్, నితీష్ కుమార్ రెడ్డి చెలరేగి ఆడారు. ముఖ్యంగా నితీష్ రెడ్డి 42 బంతుల్లో 8 సిక్స్‌లు, 3 ఫోర్ల సాయంతో 76 పరుగులతో వీరవిహారం చేశాడు. ట్రావిస్ హెడ్ (44 బంతుల్లో 58, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఈ సీజన్‌లో నాలుగో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో క్లాసెన్ (19 బంతుల్లో 42, ౩ ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 2, సందీప్ శర్మ ఒక వికెట్ తీశారు.
Also Read: Best Selling Cars in April: హ్యుందాయ్‌కు ధీటుగా టాటా మోటర్స్ అమ్మకాలు.. రెండోస్థానం ఎవరిదంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter