Sunrisers Hyderabad Vs Rajasthan Royals Playing XI Dream11 Team Tips: సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు నేడు అమితుమీ తేల్చుకోనున్నాయి. తొలి క్వాలఫైయర్-1లో ఓటమి పాలైన ఎస్ఆర్‌హెచ్.. రాజస్థాన్‌ను ఓడించి ఫైనల్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌ను ఓడించిన రాజస్థాన్.. అదే ఊపులో హైదరాబాద్‌ను ఓడించాలని చూస్తోంది. రెండు జట్లు బలంగా ఉండడంతో పోరు ఇంట్రెస్టింగ్‌గా సాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్‌కు.. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. చెన్నైలోని ఎం.చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
Also Read: పుష్ప సినిమా ముద్దు.. దేవర సినిమా వద్దు? జాన్వి కపూర్ షాకింగ్ ప్రవర్తన
హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే.. రెండు జట్ల ఐపీఎల్‌లో 19 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 విజయాలు సొంతం చేసుకోగా.. రాజస్థాన్ 9 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ప్లే ఆఫ్స్‌లో ఒకసారి తలపడగా.. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించింది. చెన్నైలో ఎస్‌ఆర్‌హెచ్ రికార్డు ఏ మాత్రం బాగోలేదు. ఇక్కడ ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం ఒకసారి మాత్రమే గెలుపొందింది. రాజస్థాన్ ఇక్కడ 9 మ్యాచ్‌లు ఆడగా.. రెండు విజయాలు సాధించింది. పిచ్ విషయానికి వస్తే.. చిదంబరం స్టేడియం పిచ్ బౌలర్లకు ఎక్కువగా సహకరిస్తుంది. ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. బౌలర్లు బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునేందుకు మొగ్గు చూపవచ్చు. ఈ సీజన్‌లో ఇక్కడ ఛేజింగ్ జట్లు ఏడు మ్యాచ్‌లలో విజయం సాధించాయి.
తుది జట్లు ఇలా.. (అంచనా)
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్/విజయకాంత్ వియస్కాంత్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్/కేశవ్ మహారాజ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్.
Also Read: Hyderabad Road Accident: హైదరాబాద్- శ్రీశైలం హైవే పై ఘోరం.. ముగ్గురి మృతి..
SRH Vs RR Dream11 Prediction:
వికెట్ కీపర్: హెన్రిచ్ క్లాసెన్, సంజు శాంసన్
బ్యాటర్లు: యశస్వి జైస్వాల్ (వైస్ కెప్టెన్), రియాన్ పరాగ్, ట్రావిస్ హెడ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ
ఆల్ రౌండర్లు: పాట్ కమిన్స్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్
బౌలర్లు: భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చాహల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter