SRH vs MI match score live updates: సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య నేడు రాత్రి 7.30 గంటలకు జరగనున్న మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్స్కి కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కి గెలవడం అనేది ఓ పాజిటివ్ నోట్‌తో ఐపిఎల్ 2021 సీజన్‌ని ముగించడం లాంటిదైతే.. ముంబై ఇండియన్స్‌కి మాత్రం హైదరాబాద్‌పై భారీ విజయం ఓ తప్పనిసరి అవసరం లాంటిది. గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 86 పరుగులు భారీ తేడాతో గెలుపొందిన నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌కి ఈ మ్యాచ్‌లో మిరాకిల్ లాంటి అద్భుతమైన విజయం సాధించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
ఐపిఎల్ మొత్తం చరిత్రలో ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల 17 మ్యాచ్‌లు జరిగాయి. అందులో ముంబై ఇండియన్స్ జట్టు 9 మ్యాచుల్లో విజయం సాధించగా.. మరో 8 మ్యాచుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపును సొంతం చేసుకుంది.
MI vs SRH matches - చివరి మ్యాచుల్లో నాలుగు గెలిచిన ముంబై ఇండియన్స్:
సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల జరిగిన చివరి 5 మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ నాలుగింట్లో విజయం సాధించి పై చేయి సాధించగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్క మ్యాచులోనే విజయం సొంతం చేసుకుంది.
David Warner against MI - ముంబై ఇండియన్స్‌పై ఎక్కువ స్కోర్ డేవిడ్ వార్నర్‌దే:
సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టేన్ డేవిడ్ వార్నర్ ముంబై ఇండియన్స్ జట్టుపై ఆడిన అన్ని మ్యాచుల్లో కలిపి 524 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ 436 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. కానీ ప్రస్తుతం ధావన్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ హార్డ్ హిట్టింగ్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ 418 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.
Bhuvneshwar Kumar - భువనేశ్వర్ కుమార్:
ఇరు జట్లు ఒకరితో మరొకరు తలపడిన మ్యాచుల్లో అత్యధిక వికెట్స్ తీసుకున్న వారిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో ముంబై ఇండియన్స్ లెజెండ్ లసిత్ మలింగ, జస్ప్రిత్ బుమ్రా ఉన్నారు.