Aiden Markram Appointed New Captain of SHR for IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తమ కొత్త కెప్టెన్ పేరును అధికారికంగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఏడెన్ మార్‌క్రమ్‌కు ఎస్‌ఆర్‌హెచ్ పగ్గాలను అప్పగించింది. ఈ విషయాన్ని ఎస్‌ఆర్‌హెచ్ కొదిసేపటి క్రితం ట్విటర్ వేదికగా ప్రకటించింది. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ నూతన సారథి ఎవరనే నిరీక్షణకు తెరపడింది. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో (ఎస్‌ఏ20) సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ తరఫున ఏడెన్ మార్‌క్రమ్ ఆడుతున్న విషయం తెలిసిందే.
'ఆరెంజ్ ఆర్మీ కొత్త కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్‌కు హలో చెప్పండి' అంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఐపీఎల్ 2023 వేలానికి ముందు ఎస్‌ఆర్‌హెచ్ ప్రాంచైజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను వేలంలోకి విడిచిపెట్టింది. దాంతో ఎస్‌ఆర్‌హెచ్‌కు కెప్టెన్ ఎంపిక అనివార్యం అయింది. 2023 వేలం అనంతరం కెప్టెన్ రేసులో చాలా పేర్లే వినిపించాయి. స్వదేశీ ప్లేయర్స్ మయాంక్ అగర్వాల్, భువనేశ్వర్ కుమార్.. విదేశీ ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్ పేర్లు ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్సీ రేసులోనిలిచాయి. చివరకు యాజమాన్యం మార్క్రమ్ వైపు మొగ్గు చూపింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు విదేశీ ఆటగాళ్లు నాయకత్వం వహించడం కొత్తేం కాదు. గతంలో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ జట్టును నడిపించారు. శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించినా అది తాత్కాలికమే అయింది. ఇప్పుడు మరోసారి విదేశీ ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్ చేతికి ఎస్‌ఆర్‌హెచ్ పగ్గాలు వెళ్లాయి. ఎస్‌ఆర్‌హెచ్ అనుబంధ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జట్టుకు కూడా మార్‌క్రమ్ కెప్టెన్. ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా టీ20 ఫ్రాంఛైజీ క్రికెట్ టోర్నీలో మారక్రమ్ జట్టు విజేతగా నిలిపాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు:
ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అన్‌మోల్‌ప్రీత్ సింగ్, సమర్థ్ వ్యాస్, హ్యారీ బ్రూక్, అబ్దుల్ సమద్, హెన్రిచ్ క్లాసెన్, సన్వీర్ సింగ్, వివ్రాంత్ శర్మ, నితీశ్‌కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, ఉపేంద్ర యాదవ్, మార్కో జన్సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్ హక్ ఫారూఖీ, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, కార్తీక్ త్యాగీ, భువనేశ్వర్ కుమార్, అకీల్ హొసేన్, మయాంక్ డాగర్, మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్.
Also Read: Shukra Gochar 2023: హోలీ తరువాత ఈ రాశుల వారికి డబ్బేడబ్బు.. ఏప్రిల్ 6 వరకు బంగారు కాలం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.