చిన్న తమ్ముడు.. పోయి బ్యాట్ బాల్ ఆడుకో! రిషబ్ పంత్‌కు ఊర్వశి రౌటెలా స్ట్రాంగ్ కౌంటర్

Urvashi Rautela hits back Rishabh Pant. 'చిన్న తమ్ముడు.. పోయి బ్యాట్ బాల్ ఆడుకో' అంటూ రిషబ్ పంత్‌కు ఊర్వశి రౌటెలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 12, 2022, 11:07 AM IST
  • పాపులారిటీ కోసం ఇంత దిగజారుతారా?
  • చిన్న తమ్ముడు.. పోయి బ్యాట్ బాల్ ఆడుకో
  • రిషబ్ పంత్‌కు ఊర్వశి రౌటెలా స్ట్రాంగ్ కౌంటర్
చిన్న తమ్ముడు.. పోయి బ్యాట్ బాల్ ఆడుకో! రిషబ్ పంత్‌కు ఊర్వశి రౌటెలా స్ట్రాంగ్ కౌంటర్

Bollywood Actress Urvashi Rautela hits back Team India Batter Rishabh Pant: భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా మధ్య సోషల్ మీడియాలో చిన్నపాటి వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఊర్వశి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేరు చెప్పుకుండా ఆర్‌పీ అని సంబోధిస్తూ.. తన ప్రేమ ఎక్కడ చెడిందనే విషయాన్ని చెప్పారు. దానికి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఊర్వశి పేరు ప్రస్తావించకుండా.. ఫేమ్, పాపులారిటీ కోసం ఇన్ని పచ్చి అబద్దాలు ఆడుతారా అని పంత్ ఫైర్ అయ్యాడు. అందుకు బదులుగా 'చిన్న తమ్ముడు.. పోయి బ్యాట్ బాల్ ఆడుకో' అంటూ పంత్‌కు ఊర్వశి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి రౌటెలా మాట్లాడుతూ... 'వారణాసిలో ఓ సినిమా షూటింగ్‌ చేసి న్యూ ఢిల్లీకి వెళ్లి ఓ షోలో పాల్గొన్నా. అక్కడ రోజంతా షూటింగ్‌ చేసి తర్వాతి రోజు ఫ్లైట్ ఎక్కి వారణాసి వెళ్లా. అప్పుడు  నన్ను కలవడానికి మిస్టర్ ఆర్‌పీ వచ్చాడు. నేను ఉంటున్న హోటల్‌కు వచ్చి లాబీలో వెయిట్ చేశాడు. ఆర్‌పీ వచ్చిన 10 నిమిషాల ముందే నేను హోటల్‌కు వచ్చి పడుకున్నా. షూటింగ్ కారణంగా అసలిపోయి బాగా నిద్రపోయా. గాఢ నిద్రలో ఉన్న నాకు ఫోన్ రింగ్ కూడా వినిపించలేదు. లేచి చూసేసరికి మిస్టర్ ఆర్‌పీ నుంచి 17 మిస్డ్ కాల్స్ వచ్చాయి. నేను చాలా ఫీల్ అయ్యా' అని అన్నారు. 

'నా కోసం మిస్టర్ ఆర్‌పీ అంతలా వెయిట్ చేశాడని వెంటనే ఫోన్ చేశా. ముంబై వచ్చాక కలుస్తానని చెప్పా. ముంబైకి వెళ్లినప్పుడు అతడిని కలిశా. అప్పుడు మిస్టర్ ఆర్‌పీ బాగానే మాట్లాడాడు. ఆ తర్వాతే ఏం జరిగిందో తెలీదు కానీ.. అతను నాతో మాట్లాడటం మానేసాడు. సోషల్ మీడియాలో నన్ను బ్లాక్ చేశాడు. ఈ విషయంపై మీడియా పలు రకాల కథనాలు రాసుకొచ్చింది. దాంతో మా మధ్య దూరం పెరిగింది' అని ఊర్వశి రౌటెలా పేర్కొన్నారు. 

ఊర్వశి రౌటెలా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఊర్వశి పేరు ప్రస్తావించకుండా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రిషబ్ పంత్ స్పందించాడు. 'కొందరు ఫేమ్, పాపులారిటీ కోసమే పచ్చి అబద్దాలు ఆడతారు. కేవలం వార్తల్లో నిలిచేందుకు ఇలా చేస్తారంటే నాకు నవ్వొస్తుంది. పాపులారిటీ కోసం ఇలా అబద్దాలు చెప్పే వారిని చూస్తుంటే చాలా బాధగా ఉంది. వాళ్లకి దేవుడి ఆశీస్సులు ఉండాలి' అని పంత్ సెటైర్ వేశాడు. దాంతో పంత్‌కు ఊర్వశి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 'చిన్న తమ్ముడు బ్యాట్ బాల్ ఆడుకుందామా. చిన్న పిల్లాడి డార్లింగ్‌గా పేరు తెచ్చుకోవడానికి నేను మున్నీని కాదు' అని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఊర్వశి వ్యాఖ్యలు నెట్టింట హల్చల్ అవుతున్నాయి. 

Also Read: World Elephant Day: నేడు ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. పెను ప్రమాదంలో గజరాజులు!

Also Read: రాఖీ కట్టి తిరిగి వెళ్తుండగా.. కారుతో ఢీకొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడు.. ఆరుగురు దుర్మరణం..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News