Matheesha Pathirana: ఐపీఎల్‌లో అదరగొట్టిన సీఎస్‌కే బౌలర్.. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం

SL Vs AFG 1st Odi Updates: శ్రీలంక-ఆఫ్ఘానిస్థాన్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌ ద్వారా శ్రీలంక జట్టు తరఫున యంగ్ బౌలర్ మతిషా పతిరణ ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ యార్కర్ స్పెషలిస్ట్ ఐపీఎల్‌లో దుమ్ములేపిన విషయం తెలిసిందే.  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 2, 2023, 06:39 PM IST
Matheesha Pathirana: ఐపీఎల్‌లో అదరగొట్టిన సీఎస్‌కే బౌలర్.. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం

SL Vs AFG 1st Odi Updates: ఐపీఎల్‌లో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ మతిషా పతిరణకు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. నేటి నుంచి ఆఫ్ఘనిస్థాన్‌తో శ్రీలంక మూడు వన్డేల సిరీస్‌ ఆడుతోంది. తొలి వన్డేలో మతిషా పతిరణకు తుది జట్టులో చోటు దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పతిరణ.. ఈ ఐపీఎల్ సీజన్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దీంతో శ్రీలంక జట్టు తరఫున ఆడే అవకాశం లభించింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో డెత్ ఓవర్లలో పతిరణ సూపర్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యార్కర్లతో బెంబేలెత్తించాడు. 

మతిషా పతిరణను బేబీ మలింగ అని కూడా అంటారు. దాదాపు మలింగ శైలిలోనే డిఫరెంట్‌గా బౌలింగ్ చేయడంతో బ్యాట్స్‌మెన్‌కు పరుగులు చేయడం కష్టం ఉంటుంది. ఈ సీజన్‌లో పతిరణ 12 మ్యాచ్‌లు ఆడగా.. మొత్తం 50 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 19.53 సగటుతో మొత్తం 19 వికెట్లు తీశాడు. ఈ సీజన్‌లో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా మారాడు. డ్వేన్ బ్రావో లేనిలోటును పతిరణ తీర్చాడు. 10 ఓవర్లు ముగిసిన తర్వాతనే పతిరణ చేతికి ధోనీ బంతి అప్పగించేవాడు. చివరి 5 ఓవర్లలో పతిరణతో మూడు ఓవర్లు బౌలింగ్ చేయించేవాడు.

20 ఏళ్ల మతిషా పతిరణకు శ్రీలంక జట్టులో కూడా అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్‌లో 8.5 ఓవర్లు వేసిన పతిరణ 7.47 ఎకానమీతో 66 పరుగులు ఇచ్చాడు. అదేవిధంగా అంతర్జాతీయ కెరీర్‌లో తొలి వికెట్ కూడా తీశాడు. రహ్మాన్ షాను ఔట్ చేశాడు. జూనియర్ మలింగగా పేరు తెచ్చుకున్న పతిరణపై శ్రీలంక భారీ ఆశలే పెట్టుకుంది. అయితే ఈ యంగ్ ప్లేయర్ ఎక్కువ కాలం జట్టులో ఉండాలంటే.. శ్రీలంక క్రికెట్ అతనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కేవలం వన్డేలు, టీ20 ఫార్మాట్‌లో పతిరాణకు అవకాశం ఇస్తే.. ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించగలడు.

Also Read: IND Vs Aus WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు హర్భజన్ టీమ్ ఇదే.. ఆ ప్లేయర్‌ జట్టులో ఉండాల్సిందే..!

ఇక ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు ఆఫ్ఘానిస్తాన్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన లంకేయులు నిర్ణీత 50 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌట్ అయ్యారు. అనంతరం అఫ్గాన్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి.. 46.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించడంలో విఫలమైన శ్రీలంక.. వచ్చే నెలలో జింబాబ్వేలో జరిగే క్వాలిఫైయర్స్ రౌండ్‌లో ఆడనుంది. ఈ 3 వన్డేల సిరీస్‌తో వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లకు సిద్దమవుతోంది. 

Also Read: YSR Yantra Seva Scheme: రైతులకు సీఎం జగన్ మరో గిఫ్ట్.. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News