Sikandar Raza to get huge money In IPL 2023 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023కు సంబంధించిన రిటెన్షన్ ప్రక్రియ మంగళవారం పూర్తయింది. బీసీసీఐ విధించిన గడువు నిన్న సాయంత్రం 5 గంటలకు ముగియడంతో.. 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రిలీజ్ జాబితాలను ప్రకటించాయి. ఐపీఎల్ 2023కి సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చి వేదికగా జరగనుంది. ఈ మినీ వేలంలో స్టార్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఇటీవలి కాలంలో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించేందుకు ఫ్రాంచైజీలు సిద్దంగా ఉన్నాయి.
ఐపీఎల్ 2023 మినీ వేలంలో జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రాజాపై కాసుల వర్షం కురవనుంది. ఇందుకు కారణం టీ20 ప్రపంచకప్ 2022లో అతడు చెలరేగడమే. ఆస్ట్రేలియా వేదికగా ఇటీవల ముగిసిన ప్రపంచకప్ 2022లో రాజా అద్భుతంగా రాణించాడు. మొత్తం 8 ఇన్నింగ్స్‌ల్లో 27.37 సగటుతో 219 పరుగులు చేశాడు. మరోవైపు బంతితో 10 వికెట్లు పడగొట్టాడు. జింబాబ్వే టీమ్ సూపర్ 12 చేరడం, పాకిస్థాన్‌ను ఓడించడంలో రాజా కీలక పాత్ర పోషించాడు.
టీ20 ప్రపంచకప్ 2022లో అదరగొట్టిన సికిందర్ రాజాపై ఐపీఎల్ ప్రాంఛైజీలు కన్నేశాయి. ఐపీఎల్ 2023 వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. కచ్చితంగా రాజా రూ. 5 కోట్లకు పైగానే అమ్ముడు పోయే అవకాశం ఉంది. అతడి కోసం ప్రాంఛైజీలు పోటీపడితే.. మాత్రం రూ. 10 కోట్లకు అమ్ముడుపోయినా ఆచ్చర్యపోనక్కర్లేదు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఇప్పటి వరకు రాజాకు ఐపీఎల్ ఆడే అవకాశం రాలేదు. రాజా మిడిలార్డర్ బ్యాటర్ మాత్రమే కాకుండా స్పిన్ బౌలింగ్ చేయగలడు.
సికిందర్ రాజాపై మూడు ఐపీఎల్ ప్రాంఛైజీలు కన్నేశాయని సమాచారం తెలుస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు రాజాపై కన్నేశాయట. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్స్ కూడా రాజాను తీసుకునేందుకు పోటీ పడుతాయని సమాచారం. ఐపీఎల్ 2023 రిటెన్షన్ ప్రక్రియలో 163 మంది ప్లేయర్లను రిటైన్ చేసుకున్న 10 ఫ్రాంచైజీలు.. 85 మంది ఆటగాళ్లను వేలంలోకి విడుదల చేశాయి.
Also Read: Gold Price Today 16 November: మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర! పెరిగిన వెండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook