Shubman Gill about Double Hundred in IND vs NZ 1st ODI: బుధవారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 145 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 208 పరుగులు చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో తొలిసారి డబుల్ సెంచరీ సాధించిన గిల్.. హ్యాట్రిక్ సిక్సర్లతో 200 మార్క్‌ను చేరుకున్నాడు. అద్భుతమైన పేస్ దళం కలిగినన్యూజిలాండ్‌ను అడ్డుకొని.. ద్విశతకం బాదడం సాధారణ విషయం కాదు. విరాట్ కోహ్లీ లాంటి స్టార్ బ్యాతారు సైతం విఫలమయిన చోట పరుగుల వరద పారించాడు.
హాఫ్ సెంచరీ పూర్తి చేయడానికి 52 బంతులను తీసుకొన్న శుభమన్ గిల్.. ఆ తర్వాత 150 మార్క్‌ను అందుకోవడానికి మాత్రం 70 బంతులను మాత్రమే తీసుకొన్నాడు. 122 బంతుల్లో 150 పరుగులు చేశాడు. ఇక ఇన్నింగ్స్ చివర్లో మరింత రెచ్చిపోయాడు. కేవలం 23 బంతుల్లోనే మరో 50 రన్స్ బాది.. డబుల్ సెంచరీ మార్క్‌ను దాటాడు. సీనియర్ బ్యాటర్లు సైతం సెంచరీ ముందు కాస్త ఆచితూచి ఆడుతారు. గిల్ మాత్రం డబుల్ సెంచరీ ముందు ఏకంగా హ్యాట్రిక్ సిక్సర్లు బాది ఔరా అనిపించాడు. అయితే తాను డబుల్ సెంచరీ చేయాలనుకోలేదని గిల్ చెప్పాడు.
మ్యాచ్ అనంతరం శుభమన్ గిల్ మాట్లాడుతూ... 'ఎక్కువగా డాట్ బాల్స్ లేకుండా ఉండేందుకు స్ట్రైకింగ్‌ను రొటేట్ చేశాను. డాట్ బాల్స్ కాకుండా ఉండేందుకు ఖాళీల్లో బంతిని పంపించాలనే ఉద్దేశంతో ఇన్నింగ్స్ ఆరంభంలో నిదానంగా ఆడాను. వికెట్లు పడుతున్నప్పుడు చివరి వరకు క్రీజ్‌లో ఉండాలని భావించా. అంతేకానీ డబుల్ సెంచరీ గురించి అస్సలు ఆలోచించలేదు. ప్రత్యర్థి బౌలర్లు పైచేయిగా ఉన్న సమయంలో.. వారిని ఒత్తిడికి గురిచేసేలా ఆడాను. 47వ ఓవర్‌లో సిక్స్‌లు కొట్టినప్పుడు డబుల్ సెంచరీ బాదగలనని నమ్మకం కలిగింది. అదే ఊపులో సిక్సులు బాది 200 చేశాను' అని అన్నాడు.
అత్యంత పిన్న వయస్సులోనే (23 ఏళ్ల 132 రోజులు) డబుల్ సెంచరీ బాదిన భారత క్రికెటర్‌గా శుబ్‌మన్ గిల్ రికార్డు నెలకొల్పాడు. 2022లో బంగ్లాదేశ్‌పై వన్డేల్లో ఇషాన్ కిషన్ (24 ఏళ్ల 145 రోజులు) ద్విశతకం బాదాడు. ఇషాన్ కంటే చిన్న వయస్సులోనే గిల్ డబుల్ సెంచరీ బాదాడు. తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే (19) 1000 పరుగులను పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా మరో కూడా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయంగా పాక్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్‌తో కలిసి గిల్ రెండో స్థానంలో ఉన్నాడు. పాక్ బ్యాటర్ ఫఖర్ జమాన్ (18) ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు.
Also Read: Rohit Sharma Record: ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.