Shreyas Iyer: ఐసీసీ 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​'గా శ్రేయస్​ అయ్యర్​

Shreyas Iyer: టీమిండియా బ్యాటర్ శ్రేయస్​ అయ్యర్... ఫిబ్రవరి నెలకు గానూ ఐసీసీ 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​​'గా నిలిచాడు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2022, 06:53 PM IST
Shreyas Iyer: ఐసీసీ 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​'గా శ్రేయస్​ అయ్యర్​

ICC Men'’s Player of the Month : ఫిబ్రవరి నెలకు గానూ 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' (ICC Men'’s Player of the Month) గా టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఎంపికయ్యాడు. మహిళల విభాగంలో న్యూజిలాండ్​ ఆల్​రౌండర్​ అమెలియా కెర్ (Amelia Kerr)​ ఈ అవార్డు దక్కించుకుంది.  వెస్డిండీస్ తోపాటు శ్రీలంకపైనే అదిరిపోయే ప్రదర్శన చేయడంతో శ్రేయస్ ను ఈ అవార్డు వరించింది. రీసెంట్ గా ఇతడు ఐపీఎల్ 2022 సీజన్ లో కేకేఆర్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఇతడిని ఐపీఎల్ మెగా వేలంలో రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసింది కోల్‌కతా నైట్ రైడర్స్‌. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కు సారథిగా వ్యవహారించాడు అయ్యర్. 

స్వదేశంలో గత నెల వెస్టిండీస్​తో జరిగిన మూడో వన్డేలో అద్భుత ఇన్నింగ్స్ (80 పరుగులు) ఆడాడు శ్రేయస్. అనంతరం మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో భాగంగా... ఆఖరి మ్యాచ్​లో 16 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు అయ్యర్​. ఇక శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్​లో మూడు మ్యాచ్​ల్లోనూ 57, 74, 73 పరుగులతో ఆజేయంగా నిలిచి.. ప్లేయర్​ ఆఫ్ ది సిరీస్​గా ఎంపికయ్యాడు. లంకతో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్​లోనూ ఇరగదీశాడు అయ్యర్​. రెండో టెస్టులో (India Vs Sri Lanka 2nd Test) 92, 67 పరుగులతో రాణించాడు. 

పింక్‌ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం 
పింక్‌ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది టీమిండియా. దీంతో భారత్ 2-0 తేడాతో టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. లంక బ్యాటర్లలో కరుణరత్నె శతకంతో (107: 174 బంతుల్లో 15×4) రాణించాడు. భారత బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ 4, బుమ్రా 3 వికెట్లు తీశాడు.

Also Read: Kohli Fans Arrested: విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ను అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News