IPL 2021: ఐపీఎల్ 2021 రద్దు కానుందా, సీజన్ 14 నిర్వహణపై BCCI పునరాలోచన

Should BCCI Cancel IPL 2021 | ఇద్దరు ఐపీఎల్ 2021 ఆటగాళ్లతో సహా మొత్తం 20 మంది వరకు కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న సీజన్ 14పై నీలినీడలు కమ్ముకున్నాయి. పలువురు విదేశీ క్రికెటర్లు ఉద్దేశపూర్వకంగానే ఈ సీజన్‌కు దూరంగా ఉండనున్నట్లు ప్రకటిస్తున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 4, 2021, 03:03 PM IST
IPL 2021: ఐపీఎల్ 2021 రద్దు కానుందా, సీజన్ 14 నిర్వహణపై BCCI పునరాలోచన

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సంబరం త్వరలోనే ప్రారంభం కానుంది. గత ఏడాది తరహాలోనే ఈ సీజన్లోనూ కోవిడ్-19 కలవరం మొదలైంది. ఇద్దరు ఐపీఎల్ 2021 ఆటగాళ్లతో సహా మొత్తం 20 మంది వరకు కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న సీజన్ 14పై నీలినీడలు కమ్ముకున్నాయి. పలువురు విదేశీ క్రికెటర్లు ఉద్దేశపూర్వకంగానే ఈ సీజన్‌కు దూరంగా ఉండనున్నట్లు ప్రకటిస్తున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవదత్ పడిక్కల్ కోవిడ్-19 బారిన పడ్డారు. దీంతో వీరికి ఐసోలేషన్‌లో ఉంచారు. తోటి క్రికెటర్లలో ఎంత మందికి కరోనా సోకిందో తెలియాదు. పైగా IPL 2021 మైదానం సిబ్బందికి సైతం కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఇంకా ఎన్ని కేసులు నమోదవుతాయో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేవదత్ పడిక్కల్ గత ఏడాది ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ సీజన్‌లో 15 మ్యాచ్‌లలో 30కి పైగా సగటుతో 473 పరుగుల చేశాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

Also Read: IPL 2021 Mumbai Indians Squad: ముంబై ఇండియన్స్ ప్లేయర్స్, వారి గణాంకాలు, పూర్తి వివరాలు

గత ఏడాది సైతం కరోనా వ్యాప్తిని అరికట్టలేకపోవడంతో ఐపీఎల్ 2020 ఏకంగా ఆరు నెలల వరకు వాయిదా పడింది. అప్పటికీ భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ వేదికగా ఐపీఎల్‌ను నిర్వహించారు. అయితే బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి కట్టుదిట్టంగా బయో బబుల్ లాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో కరోనా భయాలు లేకుండా తక్కువ కేసులతో లీగ్ నిర్వహించారు. ప్రస్తుతం ఏప్రిల్ 9న ఐపీఎల్ 2021 ప్రారంభం కానుంది.

బయో బబుల్ లాంటి విషయాలపై అవగాహనా ఉన్నప్పటికీ భారత్‌లో మైదాన సిబ్బందికి, ఆటగాళ్లలో కరోనా కేసులు అప్పుడే మొదలయ్యాయి. ఒకవేళ ముంబైలోని వేదిక సరైన సమయానికి అందుబాటులోకి రాని పక్షంలో హైదరాబాద్ లేదా ఇండోర్ వేదికలుగా ఐపీఎల్ 2021 మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెటర్, సీఎస్కే పేసర్ జోష్ హజెల్‌వుడ్ లాంటి కొందరు ఆటగాళ్లు తొలి ప్రాధాన్యం తమ ఆరోగ్యానికే అని స్పష్టత ఇస్తూ సీజన్ నుంచి పూర్తిగా తప్పుకున్నారు.

Also Read: Sachin Tendulkar Hospitalised: కరోనా పాజిటివ్, ఆసుపత్రిలో చేరిన సచిన్ టెండూల్కర్

విదేశీ క్రికెటర్లు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ తమ దేశ జాతీయ మ్యాచ్‌లకు సన్నద్ధమవుతుండగా, బీసీసీఐ తమ ఆటగాళ్ల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తుందా లేదా అనేది త్వరలో తేలనుంది. అహ్మదాబాద్, పుణే వేదికలుగా ఇటీవల ఇంగ్లాండ్‌, టీమిండియాల మధ్య వన్డే, టీ20 సిరీస్‌లు ఏ కరోనా కేసు లేకుండా విజయవంతంగా నిర్వహించింది. మరికొందరు క్రికెటర్లు, మైదాన సిబ్బంది కరోనా బారిన పడితే బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలున్నాయి.

Also Read: IPL 2021: Sanju Samson యంగ్ కెప్టెన్ కాదు, ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ ఆసక్తికర వ్యాఖ్యలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News