Shoaib Malik Skipped Sania Mirza's Red Carpet Event: టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా ఫేర్వెల్ మ్యాచ్ ఈరోజు ముగిసింది. నిజానికి ఇప్పటికే టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సానియా లాంచనంగా హైదరాబాద్‌లోని ఎల్.బి స్టేడియం వేదికగా తన చివరి మ్యాచ్ ఆడింది. డబుల్స్ మ్యాచ్ సానియా, బోపన్న-ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ జోడీ మధ్య జరిగగా సానియా చివరి మ్యాచ్ కోసం అనేక మంది టాలీవుడ్, బాలీవుడ్, క్రీడా, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు.
ప్రభుత్వం తరపున మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, మ్యాచ్‌ను తిలకించారు. ఇక సానియా చివరి మ్యాచ్ చూసేందుకు అభిమానులు భారీగా తరలి రావడంతో ఎల్.బి స్టేడియం సందడిగా మారగా మ్యాచ్ ముగిసిన తర్వాత సానియా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టింది. ఇక ఈ సాయంత్రం ఓ ప్రైవేట్ హోటల్లో రెడ్ కార్పెట్ ఈవెంట్ తో పాటుగా గాలా డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, ఏఆర్ రెహమాన్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ తో పాటు ఇంకా కొందరు క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
అయితే ఇంత మంది వచ్చినా సానియా మీర్జా ఫేర్ వెల్ కార్పెట్ ఈవెంట్ లో ఎక్కడా ఆమె భర్త షోయబ్ కనిపించ లేదు. ఫేర్ వెల్ రెడ్ కార్పెట్ ఈవెంట్ కు సానియా మీర్జా భర్త షోయబ్ దూరంగా ఉండడం ఇప్పుడు కొత్త చర్చలకు దారి తీస్తోంది. ఫేర్ వెల్ పార్టీలో సానియా మీర్జా కుటుంబ సభ్యులు పాల్గొన్నా ఆమె భర్త షోయబ్ మాలిక్ మాత్రం కనిపించలేదు.
ఉదయం ఫేర్ వెల్ మ్యాచ్ సమయంలో కూడా కేవలం సానియా మీర్జా వెంట కుటుంబ సభ్యులే కనిపించారు. ఇక ఫేర్ వెల్ కార్పెట్ పార్టీలో మహేష్ బాబు తన భార్య నమ్రతతో పాల్గొన్నారు. కొద్దిరోజుల క్రితం షోయబ్ నుంచి సానియా విడాకులు తీసుకుంటోంది అని ప్రచారం జరగగా అది ఇప్పటి పరిస్థితుల వల్ల మరోసారి చర్చనీయాంశం అవుతోంది.
Also Read: Sheezan Khan Bail: 69 రోజుల తర్వాత బెయిల్.. ఎట్టకేలకు విడుదల!
Also Read: Khushbu Sundar: శాడిస్టిక్ ప్లెజర్ పొందుతున్న అందరూ త్వరలో కోలుకోవాలలి..కుష్బూ ఘాటు కౌంటర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి