ఆల్ రౌండర్స్ క్లబ్‌లో అరుదైన ఘనత సాధించిన క్రికెటర్

ఆల్ రౌండర్స్ క్లబ్‌లో అరుదైన ఘనత సాధించిన క్రికెటర్

Last Updated : Jun 2, 2019, 10:51 PM IST
ఆల్ రౌండర్స్ క్లబ్‌లో అరుదైన ఘనత సాధించిన క్రికెటర్

లండన్: ప్రపంచ కప్‌లో భాగంగా దక్షిణ ఆఫ్రికా జట్టుతో ఆదివారం నాటి మ్యాచ్ సందర్భంగా బంగ్లాదేశ్ ఆల్ రౌండర్, మాజీ స్పిన్నర్ షకీబ్-అల్-హసన్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. కెన్నింగ్‌టన్ ఓవెల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో షకీబ్ 5వేలకు పైగా పరుగులు, 250కి పైగా వికెట్లు తీసిన ఆల్ రౌండర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. అది కూడా అతివేగంగా ఈ రికార్డు అందుకున్న ఆటగాడిగా షకీబ్ పేరు తెచ్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాడు మార్క్‌రం వికెట్ తీయడంతో షకీబ్ ఈ ఘనతను సాధించాడు.

ఇప్పటివరకు వన్డే ఇంటర్నేషనల్స్ లో 5000 పరుగులు పూర్తి చేసి 250 వికెట్స్ తీసిన ఆల్ రౌండర్స్ జాబితాలో జాక్ కల్లిస్, సనత్ జయసూర్య, షాహిది అఫ్రిది, అబ్ధుల్ రజాక్ వంటి ఆటగాళ్లు మాత్రమే ఉండగా తాజాగా ఆ జాబితాలో చేరిన ఐదవ ఆటగాడిగా షకీబ్-అల్-హసన్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు.

Trending News