IND vs WI: క్విన్స్ పార్క్ ఓవల్ వేదికగా రేపు భారత్, విండీస్ మధ్య రెండో వన్డే జరుగుతుంది. తొలి వన్డే గెలుపుతో భారత్ జోరు మీద ఉంది. ఈమ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా యోచిస్తోంది. ఆ దిశగా ముమ్మరంగా సాధన చేస్తోంది. ఇటు రెండో వన్డేలో గెలిచి సిరీస్ సమం చేయాలని వెస్టిండీస్ జట్టు భావిస్తోంది. మొదటి వన్డేలో పోరాడిన ఓడిన ఆ జట్టు..అదే స్ఫూర్తిని ప్రదర్శించాలనుకుంటోంది.
టీమిండియా మాత్రం మొదటి వన్డే జట్టుతో రెండో వన్డే ఆడనున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది. తొలి వన్డేలో భారత ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. ఇద్దరు ఓపెనర్లు హాఫ్ సెంచరీలు చేశారు. 97 పరుగులు చేసి శిఖర్ ధావన్ ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ గిల్ 64 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. మిడిలార్డర్ ఆటగాళ్లు పర్వాలేదనిపించారు.
దీంతో విండీస్ ముందు 308 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఐతే విండీస్ జట్టు చివరకు వరకు పోరాడి ఓడింది. దీంతో భారత్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈక్రమంలో భారత్..బౌలింగ్ విభాగంపై దృష్టి పెట్టింది. పొదుపుగా బౌలింగ్ చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. రెండో వన్డేలో పూర్తి స్థాయిలో ప్రదర్శన చేయాలని టీమిండియా యోచిస్తోంది.
From last-over heroics in the 1st #WIvIND ODI courtesy @mdsirajofficial to rocking some dance moves ft @ShreyasIyer15, presenting a fun interview that oozes swag 😎😎 - by @28anand
Full interview 👇https://t.co/tau2J3GcBh #TeamIndia pic.twitter.com/4rou4918Zi
— BCCI (@BCCI) July 23, 2022
Also read:IND vs WI: విండీస్ గడ్డపై టీమిండియా యువ ఆటగాడు అరుదైన రికార్డు..!
Also read:Bandi Sanjay: మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు వేళాయే..షెడ్యూల్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.