భూమిపై మనుషులు అత్యల్పంగా కనిపించే ప్రదేశం అనగానే ఆది ఏదై ఉంటది అని అసక్తిగా ఉంది కదూ.. వాస్తవానికి ఇది పాక్ లీగ్ పై సోషల్ మీడియా సెటైర్లు. వివరాల్లోకి వెళ్లినట్లయితే.. మన ఐపీఎల్‌కు ఉన్న ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు... అది ఎక్కడ ఏ ప్రాంతంలో జరిగినా టికెట్లు దొరక్క అభిమానులు ఇబ్బందిపడుతుంటారు. ఇసుక చల్లినా కిండపడని విధంగా జనాలతో స్టేడియాలు కిక్కిరిసిపోతుంటాయి. దీన్ని గమనించిన పాక్ కూడా బీసీసీఐకి పోటీగా పీసీబీ పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నం. పాక్ లో ఆడేందుకు ఆటగాళ్లు ముందుకు రాకపోవడంతో దుబాయ్ వేదికగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సీజన్ 3 లీగ్ మ్యాచ్ లు జరుగుతున్నాయి.
కొద్ది రోజుల క్రితం పీఎస్ఎల్ ఆరంభ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో హచ్ చల్ చేస్తున్నాయి. ఒక పక్క ఆడేందుకు ఆటగాళ్ల సిద్ధంగా లేరు.. మరోవైపు ప్రేక్షకులు చూసేందుకు సిద్ధంగా లేరు.. ఇవరికీ ఇష్టం లేని.. ప్రయోజనం లేని ఈ పీఎస్ఎల్ ఎందుకు దండగ అని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఈ సందర్భంలో భూమిపై మనుషులు అత్యల్పంగా కనిపించే ప్రదేశం ఏదైనా ఉంటే అది ముమ్మాటికి పీఎస్ఎల్ జరిగే ప్రదేశాలను నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు...పీఎస్ఎల్ కు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో మ్యాచ్ చూసేందుకు అభిమానుల ఆసక్తి చూపలేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. సేడియానికి సంబంధించిన గ్యాలరీలన్ని ఖాళీగా కనిపించాయి..