Sara Bollywood Debut: బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సారా తెందూల్కర్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్?

Sara Tendulkar Bollywood Debut: లెజండరీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ కుమార్తె సారా తెందూల్కర్ త్వరలోనే బాలీవుడ్ అరంగేట్రం చేయనున్నారని తెలుస్తోంది. ఇదే విషయమై హిందీ చిత్రసీమలో ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై సచిన్ తెందూల్కర్ స్పందించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 25, 2022, 04:42 PM IST
Sara Bollywood Debut: బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సారా తెందూల్కర్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్?

Sara Tendulkar Bollywood Debut: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ ముద్దుల కుమార్తె సారా టెండూల్కర్. ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అయితే మోడలింగ్ పై మొగ్గుచూపిన సారా.. త్వరలోనే వెండితెర అరంగేట్రం చేయనున్నారని సమాచారం. గతంలో ఓ బ్రాండ్ ఎండార్స్ మెంట్ లో నటించిన ఈమె.. ఇప్పుడు పూర్తి స్థాయి సినిమాలో నటించనుందని సమాచారం. 

సినిమాల్లో నటించాలనే తన కోరికకను సారా తెందూల్కర్ తల్లిదండ్రులు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ నటుడు షాహిద్ కపూర్ సినిమా ద్వారా సారా తెందూల్కర్ హీరోయిన్ గా అరంగేట్రం చేయనుందని తెలుస్తోంది. అయితే దీనిపై సారా తండ్రి సచిన్ స్పందించారు. అది పుకారేనని కొట్టిపారేశారు. ప్రస్తుతం తన కుమార్తె విద్యాభ్యాసాన్ని చేస్తోందని.. ఇప్పటికైతే సినిమాల్లో నటించే అవకాశం లేదని సచిన్ అన్నారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sara Tendulkar (@saratendulkar)

సారా తెందూల్కర్ కు సోషల్ మీడియాలో 1.8 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ తో సారా తెందూల్కర్ ప్రేమాయణం సాగిస్తుందని గతంలో ప్రచారం జరిగింది. వీరిద్దరూ ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతున్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.  

Also Read: KGF 2 Collection: బాలీవుడ్ లో 'కేజీఎఫ్ 2' హవా.. 'బాహుబలి 2' రికార్డులను కొల్లగొడుతోందా?

Also Read: Kajal Aggarwal in Acharya: 'ఆచార్య' మూవీ టీజర్, ట్రైలర్ లలో కాజల్ అగర్వాల్ లేదేంటి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News