Rajasthan Royals Vs Punjab Kings Indians Playing XI Dream11 Team Tips: రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు నేడు తలపడనున్నాయి. రాజస్థాన్ ఇప్పటికే ప్లేఆఫ్స్‌లో దాదాపు బెర్త్ కన్ఫార్మ్ చేసుకోగా.. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. అధికారికంగా అడుగుపెడుతుంది. ఆడిన 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 16 పాయింట్లతో రెండోస్థానంలో ఉంది. ఇక ఆడిన 12 మ్యాచ్‌ల్లో 8 ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించిన పంజాబ్‌కు ఈ మ్యాచ్ నామమత్రమే. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. టోర్నీని మెరుగైన స్థానంతో ముగించాలని భావిస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. అస్సాంలోని గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
Also Read: Double Ismart Teaser: మరోసారి రామ్..పూరి.. మణిశర్మ బీభత్సం..దిమాక్ కిరికిరి
హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే.. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 27 మ్యాచ్‌లు జరిగాయి. రాజస్థాన్ 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. పంజాబ్ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. పంజాబ్‌పై రాజస్థాన్ అత్యధిక స్కోరు 226 పరుగులు కాగా.. రాజస్థాన్‌పై పంజాబ్ అత్యధిక స్కోరు 223 పరుగులు. పిచ్ విషయానికి వస్తే.. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలోని పిచ్ బ్యాట్స్మెన్లకు అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. మరోసారి హైస్కోరింగ్ గేమ్‌గా సాగనుంది. గూగుల్ విన్ ప్రాబబిలిటీ ప్రకారం.. రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశం 57 శాతం ఉంది. 43 శాతం పంజాబ్ గెలిచే ఛాన్స్ ఉంది.
తుది జట్లు ఇలా.. (అంచనా)
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్ కాడ్మోర్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, శుభమ్ దూబే, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), ప్రభ్సిమ్రాన్ సింగ్, రిలీ రోసౌ, జితేష్ శర్మ, శశాంక్ సింగ్, సామ్ కర్రాన్ (కెప్టెన్), అశుతోష్ శర్మ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
RR Vs PBKS Dream11 Prediction:
==> వికెట్ కీపర్లు: జానీ బెయిర్‌స్టో (కెప్టెన్), సంజు శాంసన్, టామ్ కొహ్లర్-కాడ్మోర్
==> బ్యాటర్లు: యశస్వి జైస్వాల్, శశాంక్ సింగ్, రిలీ రోసౌ
==> ఆల్ రౌండర్లు: రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), సామ్ కుర్రాన్
==> బౌలర్లు: యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, హర్షల్ పటేల్
Also Read: Theatres Closed: థియేటర్లు బంద్.. 10 రోజులపాటు బొమ్మపడదు.. ఎందుకో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter