Buttler-Padikkal: ఏమా పరుగు.. ఒక బంతికి నాలుగు పరుగులు తీసిన బట్లర్, పడిక్కల్!

Jos Buttler, Devdutt Padikkal ran four runs in single ball. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్ వికెట్ల మధ్య పరుగెడుతూ నాలుగు పరుగులు తీశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2022, 10:36 PM IST
  • నాలుగు పరుగులు తీసిన బట్లర్-పడిక్కల్
  • ఫిట్‌నెస్ లెవల్స్‌ మాములుగా లేవుగా
  • ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బట్లర్
Buttler-Padikkal: ఏమా పరుగు.. ఒక బంతికి నాలుగు పరుగులు తీసిన బట్లర్, పడిక్కల్!

Jos Buttler, Devdutt Padikkal ran four runs in single ball: క్రికెట్ ఆటలో బ్యాటర్లు వికెట్ల మధ్య పరుగెడుతూ రెండు పరుగులు తీయడమే ఒక్కోసారి కష్టం. మూడో పరుగు కోసం అయితే చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఇక నాలుగో పరుగు దేవురెడుగు. వికెట్ల మధ్య పరుగెత్తుతూ నాలుగు పరుగులు తీయడం చాలా చాలా అరుదు. ఓవర్ త్రో లాంటి సందర్భాల్లో మాత్రమే నాలుగో పరుగు సాధ్యమవుతుంది. అయితే బ్యాటర్లు ఓవర్ త్రో కాకుండా వికెట్ల మధ్య పరుగెత్తి నాలుగు పరుగులు తీశారు. ఈ ఘటన ఐపీఎల్ 2022లో చోటుచేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్ వికెట్ల మధ్య పరుగెడుతూ నాలుగు పరుగులు తీశారు. 

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా సోమవారం ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌‌, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచులో టాస్ ఓడిన రాజస్థాన్ బ్యాటింగ్‌కు దిగగా.. ఉమేశ్ యాదవ్ మూడో ఓవర్ వేశాడు. మూడో ఓవర్ చివరి బంతిని జోస్ బట్లర్ బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా షాట్ ఆడాడు. బంతి బౌండరీ లైన్‌ను సమీపిస్తుండగా.. కోల్‌కతా ఫీల్డర్ వెంకటేశ్ అయ్యర్ డైవ్‌ చేసి బంతిని ఆపాడు. బంతిని ఆపిన అనంతరం వెంకటేశ్ బౌండరీ లైన్ దాటేయగా.. బంతి అతనికి దూరంగా వెళ్లిపోయింది. 

వెంకటేశ్ అయ్యర్‌కు బ్యాకప్‌గా వచ్చిన మరో ఫీల్డర్ కీపర్ షెల్డన్ జాక్సన్‌కు బంతిని వేశాడు. అప్పటికే జొస్ బట్లర్ నాలుగో పరుగును పూర్తి చేశాడు. అయితే నాలుగో పరుగులు తీసే క్రమంలో బట్లర్ తృటిలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. డైవ్‌ చేశాడు కాబట్టి సరిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చుసిన ఫాన్స్.. రాజస్థాన్ ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫిట్‌నెస్ లెవల్స్‌ మాములుగా లేవుగా, ఏమా పరుగు అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

ఈ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్  నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ (103; 61 బంతుల్లో 9x4, 5x6) సెంచరీతో చెలరేగాడు. దేవదత్ పడిక్కల్ (24), సంజు శాంసన్ (38) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. చివరలో షిమ్రాన్ హెట్మెయర్ (13 బంతుల్లో 26 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. కోల్‌కతా స్పిన్నర్ సునీల్ నరైన్ రెండు వికెట్లు పడగొట్టాడు. 

Also Read: Apsara Rani: ఓ చేతిలో మందు గ్లాస్.. మరో చేతిలో టవల్! హద్దులు దాటిన అప్సర రాణి అందాలు

Also Read: Cancel IPL: ఐపీఎల్ 2022ని క్యాన్సిల్ చేయండి.. డిమాండ్ చేస్తున్న ఆ రెండు జట్ల ఫాన్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News