ప్రముఖ ఐపీఎల్ జట్టైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సోషల్ మీడియాలో ఓ వైవిధ్యమైన ప్రకటనను చేసింది. ఆ ప్రకటనలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. ముందుగా మహిళా దినోత్సవం సందర్భంగా పురుషులకు శుభాకాంక్షలు చెబుతూ క్రికెట్ పురుషుల గేమ్ మాత్రమే కాదు.. మహిళల గేమ్ కూడా ఆని తెలిపింది. బిజినెస్, పాలిటిక్స్ లాంటి రంగాలలో తొలుత మహిళలకు అవకాశాలు చాలా తక్కువగా ఉండేవని.. అయితే వారు అందులో నిరూపించుకున్నారని.. తర్వాత పురుషులకే పరిమితమైన క్రికెట్ గేమ్‌లో మహిళలూ రాణించారని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ ఫేస్బుక్ పేజీలో తెలిపింది. తాము తొలుత క్రికెట్లో మహిళల విజయాల గురించి కవిత రూపంలో చెప్పాలనుకున్నామని.. కాకపోతే టైమ్ లేకపోవడం వల్ల చిన్న ఉత్తరం ద్వారా సరిపెడుతున్నామని ఛలోక్తులు కూడా విసిరింది రాయల్ ఛాలెంజర్స్ జట్టు.
"శుభాకాంక్షలు పురుషుల్లారా..! మీకు ధన్యవాదాలు చెప్పాలి. మీరు మీ కుటుంబ సభ్యులతో మహిళలు క్రికెట్ ఆడడంలో బలహీనులు అని ఎప్పుడో చెప్పి ఉంటారు. కానీ అవే మాటలు వారి తల రాతలను మార్చాయి. వారు మనతో సమానంగా నేడు క్రికెట్లో రాణిస్తున్నారు. మిథాలీ రాజ్ వంటి గొప్ప క్రీడాకారిణులే అందుకు ఉదాహరణ" అని రాయల్ ఛాలెంజర్స్ జట్టు తమ ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసింది.