RR vs RCB: ఆర్‌సీబీ అభిమానులకు బ్యాడ్ న్యూస్‌.. గ్లెన్ మాక్స్‌వెల్ ఔట్! కారణం ఇదే

Glenn Maxwell out from RR match. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగే మ్యాచులో గ్లెన్ మాక్స్‌వెల్ ఆడ‌డం లేదని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు క్రికెట్ డైరెక్టర్, మాజీ కోచ్ మైక్ హెస్సన్ తెలిపారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2022, 03:38 PM IST
  • ఆర్‌సీబీ అభిమానులకు బ్యాడ్ న్యూస్‌
  • గ్లెన్ మాక్స్‌వెల్ ఔట్
  • నేటి మ్యాచ్‌కు మాక్స్‌వెల్ దూరం
RR vs RCB: ఆర్‌సీబీ అభిమానులకు బ్యాడ్ న్యూస్‌.. గ్లెన్ మాక్స్‌వెల్ ఔట్! కారణం ఇదే

IPL 2022, RCB player Glenn Maxwell won’t play against RR: ఐపీఎల్ 2022లో నేడు మరో రసవత్తర పోరు జరగనుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో ఈ రోజు రాత్రి 7.30 గంటలకు రాజస్తాన్‌ రాయల్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జట్లు తలపడనున్నాయి. తమ చివరి మ్యాచులో గెలుపొంది మంచి ఊపుమీదున్న ఈ రెండు జట్లు మరో విజయంపై కన్నేశాయి. స్టార్లతో నిండిన రాజస్తాన్‌, బెంగళూరు జట్లు గెలుపే ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగుతున్నాయి. ఈ సమయంలో బెంగళూరుకు ఓ షాక్ తగిలింది. నేటి మ్యాచులో స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఆడడం లేదు. 

రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగే మ్యాచులో గ్లెన్ మాక్స్‌వెల్ ఆడ‌డం లేదని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు క్రికెట్ డైరెక్టర్, మాజీ కోచ్ మైక్ హెస్సన్ తెలిపారు. మంగళవారం ఆర్‌సీబీ షేర్ చేసిన వీడియోలో మైక్ హెస్సన్ మాట్లాడుతూ... 'ఈరోజు రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగే మ్యాచులో గ్లెన్ మాక్స్‌వెల్ ఆడ‌డం లేదు. క్రికెట్ ఆస్ట్రేలియా రూల్స్ ప్ర‌కారం.. ఆస్ట్రేలియా ఆట‌గాళ్లెవ‌రూ ఏప్రిల్ 6 వ‌ర‌కు ఐపీఎల్ 2022 ఆడకూడదు. 9న పుణే వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జరిగే మ్యాచుకు అతడు అందుబాటులో ఉంటాడు' అని తెలిపాడు. మ్యాక్సీ స్థానంలో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ ఆడనున్నాడు.

మార్చి 27న భార‌త సంత‌తికి చెందిన విని రామన్‌ను గ్లెన్ మాక్స్‌వెల్ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి కార‌ణంగా ఐపీఎల్‌లో ఆల‌స్యంగా అడుగుపెట్టిన మ్యాక్సీ.. ఇటీవ‌ల ముంబై చేరుకుని 3 రోజు క్వారంటైన్ పూర్తి చేసుకున్నాడు. ఆపై జ‌ట్టుతో క‌లిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. గత సీజ‌న్లో అద్భుతంగా రాణించ‌డంతో మెగా వేలం 2022కి ముందు మాక్స్‌వెల్‌ను రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ప్రాంచైజీ రిటైన్ చేసుకుంది. 

బెంగ‌ళూరు తుది జట్ల అంచనా:
ఫాప్‌ డుప్లెసిస్‌ (కెప్టెన్‌), అనూజ్‌ రావత్‌, విరాట్‌ కోహ్లీ, దినేశ్‌ కార్తిక్‌, షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్‌, షాబాజ్‌ అహ్మద్‌, వనిందు హసరంగ, డేవిడ్‌ విల్లే, హర్షల్‌ పటేల్‌, ఆకాశ్‌ దీప్‌, మహ్మద్‌ సిరాజ్‌. 

Also Read: SunRisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలోనే ఏదో లోపం ఉంది: పాక్ మాజీ క్రికెటర్

Also Read: Vimala Raman Wedding: తమిళ విలన్‌ను పెళ్లాడనున్న టాలీవుడ్‌ హీరోయిన్‌?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News