Rohit Sharma Trolls: మిలియన్ల డబ్బు ఉన్నా.. ఓ జాతీయ జెండా, కర్ర కొనలేదు! రోహిత్ శర్మపై ఫాన్స్ ఫైర్

Netizens trolls Rohit Sharma after he use photoshopped National Flag. త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకుని సాంప్రదాయ దుస్తులను ధరించిన చిత్రాన్ని రోహిత్ పోస్ట్ చేశాడు. ఈ ఫోటోనే రోహిత్‌ను విమర్శల పాలు చేసింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 16, 2022, 05:47 PM IST
  • మిలియన్ల డబ్బు ఉన్నా
  • ఓ జాతీయ జెండా కొనలేదు
  • రోహిత్ శర్మపై ఫాన్స్ ఫైర్
Rohit Sharma Trolls: మిలియన్ల డబ్బు ఉన్నా.. ఓ జాతీయ జెండా, కర్ర కొనలేదు! రోహిత్ శర్మపై ఫాన్స్ ఫైర్

Rohit Sharma not buy National Flag and Stick: సోమవారం (ఆగష్టు 15) భారతదేశ ప్రజలు 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని (Independence Day 2022) జరుపుకున్న విషయం తెలిసిందే. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గుర్తుండిపోయేలా చేయడానికి భారత ప్రభుత్వం 'హర్ ఘర్ తిరంగ అభియాన్' కార్యక్రమంను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 వరకు ప్రతి భారతీయుడు తమ ఇళ్లపై జెండా ఎగురవేయాలని ప్రధాని మోదీ కోరారు. దేశంలోని సెలెబ్రెటీలు అందరూ తమ ఇళ్లపై జెండా ఎగురవేసి.. ఆ పోటోలను తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశారు. అయితే భారత కెప్టెన్ రోహిత్ శర్మ పోస్ట్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ట్విట్టర్ వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపాడు. 'స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు' అని పేర్కొన్నాడు. ఈ ట్వీటుకు త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకుని సాంప్రదాయ దుస్తులను ధరించిన చిత్రాన్ని రోహిత్ పోస్ట్ చేశాడు. ఈ ఫోటోనే రోహిత్‌ను విమర్శల పాలు చేసింది. టీమిండియా సారథి పట్టుకున్న త్రివర్ణ పతాకం కర్ర ఓ దగ్గర వంగిపోయి ఉంది. 

రోహిత్ శర్మ జెండా ఎగురవేయలేదని, అది ఫోటోషాప్ చేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 'మిలియన్ల డబ్బు ఉన్నా.. ఓ జాతీయ జెండా, కర్ర కొనలేదు రోహిత్' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'కేవలం జెండా మాత్రమే ఎడిట్ చేశారని నేను అనుకున్నాను, కానీ రాడ్ కూడా ఎడిట్ చేయబడింది' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 'జెండా కూడా నకిలీదే' అంటూ నెటిజన్లు రోహిత్ శర్మపై ఫైర్ అవుతున్నారు. ఈ ట్వీట్స్ ప్రస్తుతం నెట్టింట పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. 

రోహిత్ శర్మ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. హరారేలో జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నుంచి రోహిత్ విశ్రాంతి తీసుకున్నాడు. ఆసియా కప్‌ 2022కు ముందు జట్టులో చేరనున్నాడు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో మొన్నటి వరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్న రోహిత్ శర్మను న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ దాటేశాడు. గప్టిల్ అంతర్జాతీయ టీ20లలో 3497 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ 3487 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

Also Read: ఓలా నుంచి చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్‌.. సింగిల్ ఛార్జింగ్‌తో 141 కిలోమీటర్ల ప్రయాణం!

Also Read: Munugode: బ్రేకింగ్.. మునుగోడులో టీఆర్ఎస్ కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ఎంపీపీ సహా కీలక నేతలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News