రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్ చివరి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ సెంచరీ పూర్తిచేశాడు. దీంతో రోహిత్ శర్మ తన టెస్టు కెరీర్లో ఆరో సెంచరీని పూర్తి చేసినట్టయింది. అంతేకాకుండా ఈ టెస్ట్ సిరీస్లో మొత్తం 16 సిక్సులు బాదడం ద్వారా రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు చేరిపోయింది. అదేంటంటే.. ఒక టెస్ట్ సిరీస్లో అత్యధిక సంఖ్యలో సిక్సులు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ పేరు రికార్డులకెక్కింది. గతంలో 2018-19 సీజన్లో వెస్టిండీస్ బ్యాట్స్మన్ షిమ్రోన్ హెట్మేయర్ బంగ్లాదేశ్తో ఆడిన టెస్ట్ సిరీస్లో 15 సిక్సులు బాదాడు. అలా హెట్మేయర్ పేరిట వరల్డ్ టెస్ట్ క్రికెట్లో ఉన్న రికార్డును తాజాగా
రోహిత్ శర్మ బద్దలుకొట్టడం విశేషం.
2010-11లో న్యూజిలాండ్తో జరిగిన ఒక టెస్ట్ సిరీస్లో 14 సిక్సులు కొట్టిన ఇండియన్ క్రికెటర్గా హర్భజన్ సింగ్ పేరిట ఉన్న రికార్డును సైతం రోహిత్ శర్మ అధిగమించాడు.