పోరు ఏ దైనా సరే.. చర్చకు వచ్చే అంశం స్థానికత. సొంత ప్రాంతంలో ఉంటే అదో ధైర్యం, నమ్మకం. ఇందులో భాగంగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ప్రాంఛైజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) కోసం యూఏఈ కెప్టెన్ అహ్మద్ రజా (Ahmed Raza), యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ కార్తీక్ మెయప్పన్‌తో డీల్ కుదర్చుకుంది. ప్రస్తుతం ఆర్సీబీ ఆటగాళ్లతో కలిసి వీరు ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరిని బెంగళూరు తమ ఫ్రాంచైజీలో చేర్చుకుందని అక్కడి స్థానిక మీడియాలో సైతం కథనాలు వచ్చాయి. Telangana Rains: మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు
ప్రత్యర్థిని దెబ్బకొట్టాలంటే ముందుగా అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయి. ఏ బౌలింగ్‌లో ఎంతమేర ప్రయోజనం ఉంటుందో తెలుసుకోవాలి. అప్పుడే తమకు వ్యూహాలకు పదునుపెట్టి విజయం సాధించవచ్చునని భావిస్తోంది. గతంలో యూఏఈలో ఆసీస్ పర్యటించినప్పుడు రజా స్పిన్ సలహాదారుడిగా పనిచేశాడు. యూఏఈ పిచ్‌లపై అన్ని స్థాయిల క్రికెట్ ఆడిన అనుభవం రజా సొంతం. ఎడమ చేతివాటం స్పిన్నర్ అయిన రజా అనుభవం ఆర్సీబీకి ప్లస్ పాయింట్ కానుందని భావించి ఫ్రాంచైజీ అతడితో పాటు యంగ్ క్రికెటర్ కార్తీక్ మయప్పన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. Virat Kohli: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ‘టాప్’ లేపిన విరాట్ కోహ్లీ
ఆర్సీబీతో కలిసి పనిచయనుండటంపై రజా హర్షం వ్యక్తం చేశాడు. ‘యూఏఈ సారథిగా బెంగళూరు కోచ్ శ్రీదరన్ నన్ను ఆర్సీబీ టీమ్‌కు పరిచయం చేశారు. ఆర్సీబీ బస చేస్తున్న హోటల్ అద్భుతంగా ఉంది. బయో బుడగ (బయో బబుల్) కాస్త కొత్తగా ఉంది. సాధ్యమైనన్ని సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని’ యూఏఈ కెప్టెన్ అహ్మద్ రజా పేర్కొన్నాడు. Arjun Tendulkar: ముంబై ఇండియన్స్ జట్టులోకి సచిన్ తనయుడు
ఫొటో గ్యాలరీలు
- Bigg Boss 4: అరియానా గ్లోరి ఫొటోలు
-
Purple Cap Winners of IPL: మ్యాచ్‌లు మలుపుతిప్పిన బౌలర్లు వీరే..
- Anchor Anasuya Photos: యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ ఫొటోస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR