నవాజ్‌ వేసిన బంతి అలా పడుంటే.. వెంటనే రిటైర్మెంట్ ఇచ్చేవాడిని! అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

R Ashwin reacts about Wide ball vs Pakistan in T20 World Cup 2022. మొహ్మద్ నవాజ్‌ వేసిన బంతి వైడ్‌ బాల్‌ పడకుండా టర్న్ అయి ప్యాడ్స్‌ను తాకి ఉంటే ఏం చేసేవాడివనే ప్రశ్నకు ఆర్ అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 28, 2022, 06:59 PM IST
  • నవాజ్‌ వేసిన బంతి అలా పడుంటే
  • వెంటనే రిటైర్మెంట్ ఇచ్చేవాడిని
  • అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
నవాజ్‌ వేసిన బంతి అలా పడుంటే.. వెంటనే రిటైర్మెంట్ ఇచ్చేవాడిని! అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Ravichandran Ashwin said If Mohammad Nawaz Ball Had Turned I Gives Retirement: టీ20 ప్రపంచకప్‌ 2022లో భాగంగా గత ఆదివారం (అక్టోబర్ 23) పాకిస్థాన్‌పై భారత్‌ చిరస్మరణీయ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఉత్కంఠంగా సాగిన మ్యాచులో 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ చివరి బంతికి ఛేదించింది. విరాట్‌ కోహ్లీ (82 నాటౌట్‌; 53 బంతుల్లో 6×4, 4×6) భారత క్రికెట్‌ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఇన్నింగ్స్‌ ఆడగా.. హార్దిక్‌ పాండ్యా (40; 37 బంతుల్లో 1×4, 2×6) అతడికి అండగా నిలబడ్డాడు. విజయం అనంతరం భారత అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మాజీలు కూడా చిన్నపిల్లలా ఎగిరి గంతులు వేశారంటే మ్యాచ్ ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. 

పాకిస్తాన్ చేతిలో ఉన్న మ్యాచును విరాట్‌ కోహ్లీ, హార్దిక్‌ పాండ్యాలు తమ బ్యాటింగ్‌తో భారత్ చేతుల్లోకి తెచ్చారు. ఇక చివరి ఓవర్‌లో భారత్ విజయ సమీకరణం 16 పరుగులుగా మారింది. తొలి బంతికే హార్దిక్ క్యాచ్ ఔట్ కాగా.. రెండో బంతికి దినేష్ కార్తీక్‌ సింగిల్ తీశాడు. మూడో బంతికి కోహ్లీ 2 పరుగులే చేశాడు. నాలుగో బంతిని నవాజ్‌ ఫుల్‌టాస్‌ వేయగా కోహ్లీ సిక్సర్ బాదేశాడు. అది నోబాల్‌ కావడం, అదనంగా ఫ్రీహిట్‌ దొరకడంతో.. భారత్ విజయ సమీకరణం 2 బంతుల్లో 2 పరుగులుగా మారింది. ఐదో బంతికి కార్తీక్‌ స్టంపౌట్‌ అయ్యాడు. ఆరో బంతికి ఆర్ అశ్విన్‌ స్ట్రైకింగ్‌కు రాగా.. వైడ్‌ బాల్ పడింది. చాలా తెలివిగా యాష్ పక్కకు జరగడంతో అదనపు రన్ వచ్చింది. చివరి బంతికి అశ్విన్‌ సింగిల్‌ తీయడంతో మ్యాచ్‌ భారత్‌ గెలిచింది.

పాక్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను క్రికెట్‌ అభిమానులు పొగిడేస్తున్నారు. అలాగే చివరి ఓవర్లో బంతిని వదిలేసి సమయస్ఫూర్తి ప్రదర్శించిన ఆర్ అశ్విన్‌ను కూడా పొగుడుతున్నారు. అయితే మొహ్మద్ నవాజ్‌ వేసిన బంతి వైడ్‌ బాల్‌ పడకుండా.. టర్న్ అయి ప్యాడ్స్‌ను తాకి ఉంటే ఏం చేసేవాడివి? అని చాలా మంది అశ్విన్‌ను అడుగుతున్నారట. తాజాగా ఈ ప్రశ్నకు యాష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నవాజ్‌ వేసిన బంతి వైడ్ కాకుండా.. తన ప్యాడ్స్‌ను తాకి ఉంటే రిటైర్మెంట్ ఇచ్చేవాడినని చెప్పాడు. 

'వైడ్‌ బాల్‌ పడకుండా ప్యాడ్స్‌ను తాకితే ఏం చేసేవాడివి అని నన్ను చాలా మంది అడిగారు. నిజంగానే బంతి వైడ్‌ అవ్వకుండా నా ప్యాడ్స్‌ను తాకి ఉంటే.. నేరుగా డ్రెస్సింగ్‌ రూంలోకి వెళ్లిపోయేవాడిని. ఫోన్‌ తీసుకుని 'నేను ఇంతటితో నా క్రికెట్‌ కెరీర్‌ను ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు' అంటూ ట్విటర్‌లో ఆటకు వీడ్కోలు పలికేవాడినని వారికి చెప్పా' అని ఆర్ అశ్విన్ తెలిపాడు. 

Also Read: ఈ రెండు పాములను చూసి.. 200 కింగ్ కోబ్రాలను పట్టుకున్న అమ్మాయి కూడా పారిపోయింది! చివరికి ఏమైందంటే  

Also Read: బాబోయ్.. వేట మామూలుగా లేదుగా! భారీ పాచ్-నోస్డ్ పామును సునాయాసంగా మింగేసిన కింగ్ స్నేక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News