IND Vs PAK T20 World Cup: దుబాయ్ (Dubai) వేదికగా జరగున్న టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2021) లో ఈ రోజు ఇండియా - పాకిస్తాన్ (India Vs Pakistan) జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ కోసం రెండు దాయాది దేశ ప్రజలే కాదు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది.
సుదీర్ఘకాలం తరువాత భారత్- పాకిస్తాన్ (India - Pakistan) మధ్య క్రికెట్ పోరు ఇవాళ జరగనుంది. చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడేందుకు టీమ్ ఇండియా (Team India) జట్టు దాదాపు సిద్ధమైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో (ICC T20 World Cup) ఈ నిరీక్షణ తొలగే సమయం వచ్చేసింది. ఇవాళ సాయంత్రం దుబాయ్ వేదికగా ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే పాకిస్తాన్ తన తుది జట్టును ప్రకటించింది. ఇండియా టీమ్ (Team India)దాదాపు సిద్ధమైంది.
Also Read: Weather update: ఏపీలో నేడు, రేపు మోస్తరు వర్షాలు
ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ (Pakistan Cricket board) రమీజ్ రాజా (Ramiz Raj) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు జరగబోయే పాకిస్తాన్ Vs ఇండియా మ్యాచ్ లో టీమిండియాను ఓడిస్తే పాకిస్తాన్ ఆటగాళ్లకు బ్లాంక్ చెక్ ఇస్తామని ప్రకటించారు. అయితే పాకిస్తాన్ జట్టులో ఆత్మ స్థైర్యం నింపేందుకు, పాకిస్తాన్ క్రికెట్ బోర్టును మరింత పటిష్టం చేయటకి ఒక ఇన్వెస్టర్ ఈ అఫర్ ఇచ్చారని రమీజ్ రాజా తెలిపారు.
ఐసీసీ ఇస్తున్న 50 శాతం నిధులతోనే పాకిస్తాన్ బోర్టు నడుస్తుంది. అంతేకాకుండా ఐసీసీకి 90 శాతం నిధులు సమకూర్చేది మాత్రం బీసీసీఐ. ఒకవేళ బీసీసీఐ, ఐసీసీ కి నిధులు ఆపేస్తే, అటు ఐసీసీ, ఇటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రెండు ప్రమాదాల్లో పడే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ రమీజ్ రాజా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది.
Also Read: Vallabhaneni Vamsi: చంద్రబాబుని మించిన విశ్వాస ఘాతకుడు ఎవరున్నారు
ఇక టీ20 వరల్డ్ కప్ లో భారత్- పాకిస్తాన్ మధ్య 5 మ్యాచ్ లు జరగగా.. 4 మ్యాచ్ లలో భారత్ విజయం సాధించగా.. ఒక మ్యాహ్ రద్దయింది. టీ20 క్రికెట్ ప్రపంచకప్ లో ఇప్పటివరకు భారత్ దే పై చేయి కొనసాగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook