Pushpa: ఇంకా తగ్గని 'పుష్ప' మేనియా.. తగ్గేదేలే అంటున్న రాజస్థాన్ రాయల్స్ టీమ్..

Pushpa Mania: అల్లు అర్జున్ 'పుష్ప' మేనియా ఇప్పట్లో తగ్గేలా లేదు. తాజాగా పుష్ప చిత్రంలోని డైలాగ్ ను తమదైన శైలిలో రీక్రియేట్ చేసి ఆకట్టుకున్నారు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2022, 02:05 PM IST
  • క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తోన్న 'పుష్ప' ఫీవర్
  • పుష్పరాజ్ డైలాగ్ ను అదరగొట్టిన రాజస్థాన్ క్రికెటర్లు
Pushpa: ఇంకా తగ్గని 'పుష్ప' మేనియా.. తగ్గేదేలే అంటున్న రాజస్థాన్ రాయల్స్ టీమ్..

Pushpa Mania in Cricket: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన ‘పుష్ప’ (Pushpa) క్రేజ్ ఇప్పట్లో తగ్గేలా లేదు. గతేడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలోని డైలాగులు, సాంగ్స్ అయితే సోషల్ మీడియాను (Social Media) ఊపేస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలిబ్రిటీల దాకా ప్రతి ఒక్కరూ ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్ ను తమదైన శైలిలో రీక్రియేట్ చేస్తున్నారు. 

ఇక క్రికెటర్లు అయితే ఆ సినిమాకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు. టీమిండియా క్రికెటర్లు రవీంద్ర జడేజా, శిఖర్‌ ధావన్‌, సురేశ్‌ రైనా, హార్దిక్‌ పాండ్యాతో పాటు విదేశీ క్రికెటర్లు సైతం పుష్పరాజ్ ను ఇమిటేట్ చేస్తున్నారు. ఇక ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అయితే రోజుకో ‘పుష్ప’ (Pushpa Movie) వీడియోను షేర్ చేస్తూ నెట్టింట హల్ చల్ చేశాడు. 

తాజాగా ఈ జాబితాలోకి రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు (Rajasthan Royals Team) చేరిపోయారు. ఈ సందర్భంగా పుష్ప చిత్రంలోని 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకంటున్నావా ...కాదు ఫైర్' అనే డైలాగ్ ను తమదైన శైలిలో చెప్పి ఆకట్టుకున్నారు. ఈ వీడియోలో యజేంద్ర చాహల్ (Yuzvendra Chahal), నవదీప్ సైనీ (Navdeep saini)  పుష్ప సంభాషణలను రీక్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మీరు ఓ లుక్కేయండి.  

Also Read: Robin Uthappa : ఐపీఎల్ వేలంపై ఉతప్ప షాకింగ్ కామెంట్స్...ఆటగాళ్లను సంతలో పశువుల్లా కొంటున్నారు అంటూ ఆవేదన..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News